ఆర్టీసీ కార్మికులను చుట్టేస్తున్న కరోనా మహమ్మారి

July 11, 2020


img

దేశానికి అధ్యక్షుడైనా... మురికికాలువలు శుభ్రపరిచే పారిశుధ్య కార్మికుడైన కరోనా మహమ్మారికి ఒక్కటే. అది ఎవరినీ  ఎవరినీ విడిచిపెట్టడం లేదు. కరోనా బాధితుల జాబితాలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా చేరిపోయారు. సిటీ బస్సులు నడిపితే కరోనా వ్యాపిస్తుందనే ఆలోచనతో వాటిని పక్కనపెట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని రూట్ బస్సులను నడిపిస్తోంది. కానీ వాటిలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లకు కరోనా సోకుతుండటంతో వారి ద్వారా వారి కుటుంబాలకు కరోనా వ్యాపిస్తోంది. అయితే మొదటి నుంచి నష్టాలలో నడుస్తున్న ఆర్టీసీ అంటే బహుశః ప్రభుత్వానికి కూడా చిన్న చూపే కావచ్చు. కనుక వారి కోసం ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేకమైన ఏర్పాట్లు, సౌకర్యాలు చేయకపోవడంతో ఇప్పటి వరకు 30మంది కార్మికులకు కరోనా సోకింది. నలుగురు ఆర్టీసీ కార్మికులు కరోనాతో మరణించారు.

తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో కరోనా వార్డును ఏర్పాటు చేయాలని, తమకు కూడా రూ.50 లక్షల జీవితభీమా కల్పించాలని వారు కోరుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్టీసీ తీవ్రంగా నష్టపోవడంతో క్రిందటి నెలవరకు సగం జీతాలే అందేయి. దాంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టీసీ కార్మికులను ఇప్పుడు ఈ కరోనా మహమ్మారిని పట్టిపీడిస్తోంది. ఆర్టీసీ సమ్మె ముగిసిన తరువాత కార్మికుల సమస్యలు ఎప్పటికప్పుడు తీర్చివేస్తామని చెప్పి ప్రభుత్వం ఆర్టీసీ యూనియన్లను రద్దు చేసింది. కానీ తమ సమస్యలను వినే నాధుడే లేడని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి రోదన అరణ్యరోదనే అవుతుందా? ఏమో! 


Related Post