ఏపీలో ఆరోగ్యశ్రీ పధకంలో కరోనా చికిత్స.. ఛార్జీలు

July 09, 2020


img

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా వైరస్‌ను కూడా ఆరోగ్యశ్రీ పధకంలో చేర్చింది. దీంతో ఏపీలో తెల్లారేషన్ కార్డు ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచితంగా కరోనా వైద్యచికిత్సలు పొందవచ్చు. దీనికోసం రోగులు ఎటువంటి ఛార్జీలను చెల్లించనవసరం లేదు. ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుందని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ మల్లిఖార్జున తెలిపారు.  

ఆరోగ్యశ్రీ పధకానికి అర్హులైనవారు ఆ నెట్‌వర్క్‌ పరిధిలో లేని వేరే ఆసుపత్రులలో కరోనాకు చికిత్స చేసుకొనేందుకు ఏపీ ప్రభుత్వం వీలు కల్పించింది. వాటిలో చికిత్సకు ఛార్జీలను ఖరారు చేస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బుదవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఎటువంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేనివారికి కరోనా వైరస్ సోకినట్లయితే రోజుకు రూ.3,250 

ఐసీయూలో చికిత్సకు రోజుకు రూ.5,480 

ఐసీయూలో నాన్ ఈమెజీవ్ ఇన్వెస్టిగేషన్ (ఎన్ఐవి)కి రూ.5,980 

ఐసీయూలో వెంటిలేటరుపై ఉంచి చికిత్సకు రోజుకు రూ.9,580 

ఆరోగ్యం బాగా క్షీణించి ఐసీయూలో వెంటిలేటరు లేకుండా చికిత్స చేయడానికి రోజుకు రూ: 6,280 

ఆరోగ్యం బాగా క్షీణించి ఐసీయూలో వెంటిలేటరుపై చికిత్స చేయవలసివస్తే రోజుకు రూ.10,380 

 ఆరోగ్యశ్రీ పధకం వర్తించని ఆసుపత్రులలో కరోనా రోగులకు ప్రత్యేకంగా గదికి రోజుకు రూ. 600 (పీపీఈ కిట్లు, కరోనా పరీక్షలకు ఛార్జీలు అదనం). 


Related Post