అన్‌లాక్‌-2 మార్గదర్శకాలు జారీ

June 30, 2020


img

నేటితో దేశంలో అన్‌లాక్‌-1 పూర్తవుతుంది కనుక రేపటి నుంచి ప్రారంభం అయ్యే అన్‌లాక్‌-2కు కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 

1. అన్‌లాక్‌-1లో ఇచ్చిన సడలింపులు జూలై 31వరకు యధాతధంగా కొనసాగుతాయి. 

2. జూలై 31 వరకు కంటెయిన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ ఆంక్షలు యధాతధంగా కొనసాగుతాయి. 

3. దేశవ్యాప్తంగా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. 

4. స్కూళ్ళు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ ఫూల్స్, జిమ్ సెంటర్లపై జూలై 31 వరకు నిషేధం కొనగుతుంది. 

5. సాధారణ రైళ్లు, మెట్రో రైళ్లు, అంతర్జాతీయ విమాన సేవలపై జూలై 31 వరకు నిషేధం కొనసాగుతుంది. 

6. ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్ధనా మందిరాలలో సామూహిక పూజలు, ప్రార్ధనలు, సమావేశాలు నిషేధం కొనసాగుతుంది. 

7. రాజకీయ, మత సమావేశాలు, సభలకు అనుమతి లేదు.


Related Post