కేంద్రం తాజా మార్గదర్శకాలు జారీ

June 05, 2019


img

ఈ నెల 8 నుంచి దేశవ్యాప్తంగా హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే వాటిలోనే కరోనా వైరస్‌ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక వాటి కోసం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. 

1. సిబ్బందికి ఎటువంటి అనారోగ్య లక్షణాలు ఉండకూడదు. ఉంటే పనికి అనుమతించకూడదు. 

2. హోటల్స్, రెస్టారెంట్స్ లోపల, బయట వినియోగదారులు భౌతికదూరం పాటించేలా ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలి. 

3. మాస్కూలు ధరించనివారిని, కరోనా లక్షణాలున్నవారిని లోనికి అనుమతించరాదు.

4. లోపలకు ప్రవేశించే ముందే ప్రతీ ఒక్కరికీ ధర్మల్ స్క్రీనింగ్ చేయాలి.  

5. రెస్టారెంట్లో కూర్చొని తినే పద్దతికి బదులు ఫుడ్ పార్సిల్స్ తీసుకొనివెళ్ళేలా వినియోయగదారులను ప్రోత్సహించాలి. 

6. వినియోగదారులు, సిబ్బంది రాకపోకలకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేసుకోవాలి.

7.  పిల్లలు, వృద్ధులు, గర్భిణి స్త్రీల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

8.   నగదు రహిత లావాదేవీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. 

9. హోటల్స్ లో బస చేయడానికి వచ్చినవారి ఫోన్‌ నెంబర్లు, చిరునామా, ఆరోగ్య పరిస్థితి వగైరాపూర్తి వివరాలను రికార్డులలో భద్రపరచాలి. అతిధుల నుంచి తమకు కరోనా లక్షణాలు లేవని తెలియజేస్తూ పత్రం, గుర్తింపు కార్డుల వివరాలు తీసుకొని వాటిని భద్రపరచాలి.     

10. హోటల్స్, రెస్టారెంట్స్ లోపల బల్లలు, కుర్చీలు, గదులు, టాయిలెట్లు నిత్యం శానిటైజ్ చేస్తుండాలి. వినియోగదారులకు ఒకసారి వాడి పారేసే మెనూ కార్డులు, న్యాప్ కిన్స్ వంటివి అందించాలి. అలాగే వినియోగదారుల బ్యాగులు, లాగేజీలను శానిటైజ్ చేయకుండా లోపలకు అనుమతించరాదు.    

11. వినియోగదారులు బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేయకుండా కట్టడి చేయాలి. 


Related Post