ఆవేశ పడాల్సిన వీరు సైలెంట్ అయితే.. సైలెంట్ అవ్వాల్సిన వాళ్ళు ఆవేశ పడుతున్నారు..!

May 29, 2020


img

పెద్దాయన ఎన్టీఆర్ చూపిన బాటలో హీరోగా నందమూరి ఫ్యామిలీ ఛరిష్మాని కొనసాగించాడు నందమూరి బాలకృష్ణ. బాలయ్య సినిమాలో యాక్షన్ సీన్స్, డైలాగ్స్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్పుకునేలా ఉంటాయి. అయితే బాలయ్య కెమెరా ముందు చెప్పాల్సిన డైలాగులు బయట చెప్పేస్తున్నాడు. ఒక వయసు వచ్చాక కొద్దిగా అటు ఇటుగా మాట్లాడాల్సి ఉంటుంది. కానీ నేను నాకు నోటికి వచ్చిందే మాట్లాడితే అంటే చిక్కులు తప్పవు. ఆవేశంలో బాలయ్య ఏదో ఒకటి అనడం ఎక్కడ దొరుకుతాడా అని ఎదురుచూసే మీడియా ఛానెల్స్ ఆ క్లిప్స్ మళ్ళీ మళ్ళీ ప్లే చేయడం.. ఆయన చేసిన కామెంట్స్ కు మళ్ళీ ఎవరో ఒకరు రివర్స్ పంచ్ వేయడం.. ఇలా మీడియా వాళ్లకు ఆరోజు ఇక స్టఫ్ దొరికినట్టే అని భావిస్తారు. 

ఇక బాలకృష్ణ మాట్లాడే మాటలకు మొదట రియాక్ట్ అయ్యే పర్సన్ మెగా బ్రదర్ నాగబాబు. హీరో, నిర్మాతగా సక్సెస్ కాలేకపోయినా క్యారక్టర్ ఆర్టిస్టుగా నాగబాబు మంచి రోల్స్ చేస్తున్నాడు. రాజకీయ పరమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ ఏదో ఒకటి అనడం.. దానికి నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం ఇది కామన్ అయ్యింది. అయితే అసలు ఆవేశ పడాల్సిన వయసు.. ఉడుకు రక్తం పారుతున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఎంచక్కా స్నేహితులుగా కలిసి సినిమాలు చేస్తున్నారు. సైలెంట్ గా ఉండాల్సిన ఈ వయసులో మైకు ముందుకొచ్చి రెచ్చిపోతున్నారు ఈ సీనియర్ స్టార్స్. 

బాలకృష్ణ, నాగబాబుల మధ్య పర్సనల్ గొడవలు ఏమి లేవు.. ఉండవు.. కానీ బాలకృష్ణ పొరపాటున ఏదైనా నోరు జారితే మాత్రం దాన్ని అసలు సహించడు నాగబాబు. ఈ వయసులో ఆలోచనతో మాట్లాడాల్సిన ఈ ఇద్దరు ఆవేశాలకు వెళ్లి గొడవలు పడుతుంటే.. వయసులో ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మాత్రం ఇవేవి పట్టనట్టుగా ఉంటున్నారు. అప్పుడెప్పుడో బాలకృష్ణ మాటలకు హర్ట్ అయిన నాగబాబు బాలకృష్ణ అంటే నాకు తెలిసి ఓ కమెడియన్ అంటూ పాత కాలం బాలకృష్ణ ఫోటో చూపించి కామెడీ చేశాడు. ఆ తర్వాత డైరెక్ట్ పాయింట్ కు వచ్చి బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చాడు. 

ఇక లేటెస్ట్ గా సినిమా షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి.. సీసీసీ తరపున సినీ కార్మికులకు ఎప్పుడు ఎలాంటి సహాయాన్ని అందించాలన్న విషయంపై తెలంగాణా ప్రభుత్వంపై సినీ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఈ చిరంజీవి ఆధ్వర్యంలో జరుగుతున్నా ఈ చర్చలకు తనని పిలవనందుకు కస్సు బస్సు లాడుతున్నాడు బాలకృష్ణ. తనని ఎవరు పిలవలేదని.. భూములు పంచుకునే మీటింగ్ అని అన్నాడు. మధ్యలో బీప్ సౌండ్ కూడా రావడంతో వీడియో వైరల్ అయ్యింది. దానికి నాగబాబు రియాక్షన్ వీడియో కూడా వచ్చింది. ఇలా ఈ ఇద్దరు ఒకరు అన్న మాటలకు మరొకరు పోట్లాడుతూ పొతే ఇండస్ట్రీకి అంత మంచిది కాదు.. సినీ పెద్దల సమక్షంలోనే ఇలాంటి వ్యక్తిగత దూషణలకు ముగింపు పలికేలా కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరి అది ఎప్పటికి జరుగుతుందో ఏంటో చూడాలి. 



Related Post