కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

May 28, 2020


img

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది. కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కర్ణాటకకు ప్రజల రాకపోకలను తాత్కాలికంగా నిషేదిస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఆ రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చే విమానాలను, రైళ్ళ రాకపోకలను కూడా తాత్కాలికంగా నిషేదిస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఆ రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణికులతో వచ్చే వాహనాలను కూడా రాష్ట్రంలోకి అనుమతించబోమని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప అధ్యక్షతన ఈరోజు బెంగళూరులో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వారితో రాష్ట్రంలో కరోనా వైరస్ పెరగకుండా అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతోనే తాత్కాలికంగా ఈ నిషేదం విదిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. 

కరోనాను అడ్డుకోవడానికి దాదాపు అన్ని దేశాలు, రాష్ట్రాలు కాస్త అటూఇటూగా ఇదే విధానం అమలుచేస్తున్నాయి కనుక కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. అయితే కరోనా మహమ్మారి ఇప్పట్లో పోయేది కాదని స్పష్టమైనప్పుడు, ఈవిధంగా ఎంతకాలం ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలను నిలిపివేసుకోగలదు?ముఖ్యంగా దేశానికి ఐ‌టి రాజధానిగా చెప్పుకోబడే బెంగళూరుకు నిత్యం అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. వారిని ఎంతకాలం అడ్డుకోగలదు? ఇంతకంటే కర్ణాటకలో కరోనా మహమ్మారి కట్టడికి మరింత గట్టి ప్రయత్నాలు చేస్తే మంచిదేమో?


Related Post