సీతక్క ఔదార్యం…ఏపీలో గిరిజనులకు రేషన్ పంపిణీ

May 25, 2020


img

అసలు సిసలైన ప్రజాప్రతినిధి అంటే ఏవిధంగా ఉండాలో సీతక్కను చూసి నేర్చుకోవలసిందే. ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క గత రెండు నెలలుగా తెలంగాణలో మారుమూల గ్రామాలలో పర్యటిస్తూ అక్కడ నివశిస్తున్న ఆదివాసీ గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ఆహారం, పిల్లలకు బిస్కట్లు వగైరా అందజేస్తున్నారు. సేవకు సరిహద్దులు అడ్డుకావని నిరూపిస్తూ సోమవారం ఆమె రెండు, మూడు వాహనాలలో నిత్యావసర సరుకులు వేసుకొని ఏపీలో పాపికొండలు అటవీ ప్రాంతం చేరుకొన్నారు. వాహనాలలో తెచ్చిన నిత్యావసర సరుకుల మూటలను ఆమె కూడా తలెకెత్తుకొని మోసుకొంటూ గొదావరి ఒడ్డున లంగరు వేసున్న లాంచీలోకి చేరవేశారు. అక్కడి నుంచి లాంచీలో ప్రయాణించి ఏడు కొండరెడ్ల గ్రామాలకు చేరుకొని అక్కడ నివశిస్తున్న ఆదివాసీ గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, పిల్లలకు బిస్కట్లు వగైరా అందజేశారు. మహిళలకు చీరలు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ సంస్థ సభ్యులు, సీతక్క అనుచరులు పాలు పంచుకొన్నారు. 

ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ ప్రభుత్వం 5కేజీలు చొప్పున బియ్యం పంపిణీ చేసిందని ఇక్కడి ప్రజలు చెప్పారు. దాంతో వారు నెలంతా ఏవిధంగా బ్రతుకుతారు?కనుక  మారుమూల గ్రామాలలో ఉన్న ఈ నిరుపేద ఆదివాసీకుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసి ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.


Related Post