ఏపీలో 15/329 కరోనా పాజిటివ్ కేసులు

April 08, 2020


img

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈరోజు నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వాటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కి చేరింది. అయితే నిన్న గుంటూరులో కొత్తగా నమోదు అయిన కేసులలో కరోనా సోకినవారు విదేశాల నుంచి వచ్చినవారిని కానీ, డిల్లీ మర్కజ్ సమావేశాలకు వెళ్ళివచ్చినవారిని గానీ ప్రత్యక్షంగా కలవలేదని తెలియడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే, ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చినవారిని, డిల్లీ మర్కజ్ సమావేశాలకు వెళ్ళివచ్చినవారి ద్వారానే కరోనా వైరస్‌ ఇతరులకు సోకుతోంది కనుక వారిని తేలికగానే గుర్తించగలిగారు. కానీ ఇప్పుడు కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకొన్నట్లయితే అది ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అప్పుడు కరోనా లక్షణాలున్నవారినీ, వైరస్ సోకినవారిని గుర్తించడానికి ఇంకా శ్రమపడవలసి వస్తుంది.

కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా ప్రభావిత జిల్లాలలో 2-3 లక్షల మందికి కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించడానికి సిద్దం అవుతోంది. దీని కోసం ‘ర్యాపిడ్ టెస్ట్ కిట్స్’ దిగుమతి చేసుకొంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఇంటింటికీ వాలంటీర్లను, ఆశావర్కర్లను పంపించి సర్వే చేయిస్తోంది. ఒకవేళ కరోనా సామాజికవ్యాప్తి చెందడం ప్రారంభిస్తే, వేలసంఖ్యలో కరోనా ఐసోలేషన్ వార్డులు, రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులు, వైద్యులు, మందులు, పరికరాలు అవసరముంటాయి కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకొంటోంది.

 

జిల్లా

పాజిటివ్ కేసుల సంఖ్య

కోలుకొన్నవారు

1

అనంతపురం

6

0

2

చిత్తూరు

20

0

3

తూర్పు గోదావరి

11

1

4

పశ్చిమ గోదావరి

21

0

5

కృష్ణా

35

2

6

గుంటూరు

41

0

7

కడప

28

0

8

కర్నూలు

74

0

9

నెల్లూరు

49

1

10

ప్రకాశం

24

1

11

విశాఖపట్నం

20

1

 

మొత్తం

329

5

మృతుల సంఖ్య : 2


Related Post