ఒక్క పిలుపుతో భారత్‌ వెలిగింది!

April 06, 2020


img

దేశాన్ని కరోనా సంక్షోభం కమ్ముకొన్న ఈ క్లిష్టతరుణంలో 130 కోట్ల మంది భారతీయులు కలిసికట్టుగా నిలిచి దానిని ఎదుర్కొంటామని సూచిస్తూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాలసేపు అందరూ ఇళ్ళ బయట దీపాలు వెలిగించాలనే ప్రధాని నరేంద్రమోడీ పిలిపుకు యావత్ దేశప్రజలు సానుకూలంగా స్పందించి కోట్లాది దీపాలు వెలిగించి సమైక్యతను చాటి చెప్పారు. కరోనాపై ప్రత్యక్షంగా పోరాడుతున్న వేలాదిమంది వైద్యులు, వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుద్య సిబ్బంది, ప్రజారోగ్యశాఖ సిబ్బంది, ఆశావర్కర్లు అందరికీ దీపాలు వెలిగించడం ద్వారా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, ఏపీ, తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉత్తరదక్షిణాది సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల అధినేతలు, వారి కుటుంబాలు, సిబ్బంది, కేంద్రరాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ఉపాద్యాయుల మొదలు మారుమూలగ్రామాలలో ప్రజల వరకు అందరూ ఇళ్ళ ముందు దీపాలు వెలిగించి సమైక్యత చాటారు. 

దేశప్రజలందరూ ఒకేసారి ఇళ్ళలో లైట్లు ఆర్పివేస్తే విద్యుత్ గ్రిడ్స్ వైఫల్యం చెందకుండా విద్యుత్ సంస్థలు ముందు జాగ్రత్తలు తీసుకోవడం వలన ఎటువంటి సాంకేతిక సమస్యలు ఎదురవలేదు.     

ప్రధాని నరేంద్రమోడీ పిలుపును అసదుద్దీన్ ఓవైసీ వంటివారు ఆక్షేపించినప్పటికీ దేశవ్యాప్తంగా కోట్లాది ముస్లిం ప్రజలు కూడా ఇళ్ళ ముందు దీపాలు వెలిగించి కరోనాపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో‘మేము సైతం’ అంటూ సమైక్యతను చాటిచెప్పారు. 



Related Post