రైల్వేబోగీలలో క్వారంటైన్‌ గదులు!

March 30, 2020


img

కరోనాపై దేశం చేస్తున్న యుద్ధంలో భారతీయ రైల్వేలు కూడా ‘మేము సైతం’ అంటూ ముందుకు వచ్చాయి. దేశవ్యాప్తంగా 17 రైల్వే జోన్లలోగల ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో 637 బోగీలను క్వారంటైన్‌ గదులుగా మార్చుతోంది. వాటిలో 24 గంటలు విద్యుత్ సరఫరా, కరోనా రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన పరికరాలను అమర్చుతోంది. అలాగే ఈ క్వారంటైన్‌ గదులలో ఉండబోయే రోగుల కోసం వేడివేడిగా ఆహారం అందించేందుకు ప్యాంట్రీకారును కూడా జతచేస్తోంది. దేశంలో చాలా ప్రాంతాలు రైల్వేలతో అనుసంధానమై ఉన్నాయి కనుక ఈ క్వారంటైన్‌ బోగీలతో కూడిన ఈ ‘జీవన్‌రేఖా ఎక్స్‌ప్రెస్‌’ అవసరమైన చోటికి చేరుకొని వైద్య సేవలు అందించనుంది.  

ఇటీవల కరోనా సమస్యపై ప్రధాని నరేంద్రమోడీ వివిద శాఖల మంత్రులు, అధికారులతో సమావేశమైనప్పుడు ఈ సమస్యల పరిష్కారానికి అందరూ లోతుగా ఆలోచించి విన్నూత్నమైన ప్రతిపాదనలు సూచించవలసిందిగా కోరినప్పుడు, రైల్వే అధికారులు ఈ క్వారంటైన్‌ బోగీలతో కూడిన ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రతిపాదన చేశారు. దానికి ప్రధాని నరేంద్రమోడీ వెంటనే ఆమోదం తెలుపడంతో రైల్వేశాఖ యుద్ధప్రాతిపదికన క్వారంటైన్‌ బోగీలను సిద్దం చేస్తోంది. ఇప్పటికే సిద్దం చేసిన వాటికి సంబందించిన ఫోటోలను మీడియాకు విడుదల చేసింది. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన ఆ బోగీలను చూస్తే ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు.



Related Post