ఇలాంటి అభిమానం నాకొద్దు: కేటీఆర్‌

February 25, 2020


img

సినిమాతారలకే కాదు... కొందరు రాజకీయ నాయకులకు కూడా వీరాభిమానులు ఉంటారని ఈ తాజా పరిణామంతో అర్ధమవుతుంది. రవి కిరణ్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌ వీరాభిమాని. అతను తన అభిమానాన్ని చాటుకొనేందుకు వీపు మీద కేటీఆర్‌ బొమ్మను పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. దానికి పైభాగంలో ‘యంగ్ డైనమిక్ లీడర్’ అని దిగువన ‘జై రామ్ అన్న’ అని వ్రాయించుకొని, సోషల్ మీడియాలో పెట్టాడు. ఊహించినట్లే అది వైరల్ అయ్యింది. కేటీఆర్‌కు ట్యాగ్ చేయడంతో అది ఆయనకు కూడా చేరింది. కానీ కేటీఆర్‌ కూడా అనూహ్యంగా స్పందించారు. “ఇది నిజమా.. క్షమించు బ్రదర్. ఇలాంటివాటికి నేను మద్దతు ఇవ్వను... ప్రోత్సహించను. ఎందుకంటే ఇటువంటివి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. మంచిది కాదు,” అంటూ ట్వీట్ చేశారు. నిజమే కదా?   

       


Related Post