సుల్తాన్‌పూర్ మెడికల్ పార్క్‌లో త్వరలో ఉత్పత్తి కార్యక్రమాలు

February 21, 2020


img

దేశీయంగా వైద్యపరికరాలను తయారుచేసేందుకు హైదరాబాద్‌ శివార్లలో సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజస్ పార్క్‌కు రాష్ట్ర ప్రభుత్వం 276 ఎకరాలు కేటాయించి దానిని అన్నివిధాలా అభివృద్ధి చేసింది. దానిలో వైద్యపరికరాలను తయారుచేసే 20 పారిశ్రామిక సంస్థలకు భూకేటాయింపులు కూడా పూర్తయ్యాయి. వాటిలో ఆరు నిర్మాణపనులు పూర్తిచేసుకొని ఉత్పత్తికి సిద్దం అయ్యాయి. ఈ ఏడాది జూలై నుంచి అవి ఉత్పత్తి, వాణిజ్య కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాయి.గుండె రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు వేసే స్టంట్లను దేశీయంగా తయారుచేస్తున్న సహజానంద్ టెక్నాలజీ సంస్థ కూడా సుల్తాన్‌పూర్ మెడికల్ పార్క్‌లో ఏర్పాటవుతోంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి అది కూడా సుల్తాన్‌పూర్ ప్లాంటులో ఉత్పత్తి కార్యక్రమాలు ప్రారంభించబోతోంది. బుదవారం మరో 5 సంస్థలకు భూకేటాయింపు పత్రాలను పరిశ్రమలశాఖమంత్రి కేటీఆర్‌ ఆయా సంస్థల ప్రతినిధులకు హైదరాబాద్‌లో జరిగిన బయోఏషియా 2020 సదస్సులో అందజేశారు. 

 

దానిలో ‘ఐప్లెడ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ మొబిలిటీ అండ్‌ హెల్త్‌ కేర్‌'  హబ్‌ ఏర్పాటు చేయడానికి ఇంటెల్ సంస్థ ముందుకువచ్చింది. ఈ ప్రాజెక్టులో కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇంటెల్‌తో సహా పలు సంస్థలు భాగస్వాములుగా ఉంటాయి.     

 

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాకాలు, అమలుచేస్తున్న సరళమైన పారిశ్రామిక విధానాల కారణంగా సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజస్ పార్క్‌లో పరిశ్రమలు స్థాపించడానికి పలుసంస్థలు దరఖాస్తు చేసుకోనందున వాటి కోసం ప్రభుత్వం మళ్ళీ భూసేకరణ చేయవలసివస్తోందంటే ప్రభుత్వ విధానాలు ఎంతగా విజయవంతం అయ్యాయో అర్ధమవుతోంది.

Related Post