మంత్రి మల్లారెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

February 18, 2020


img

మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి, వారి అనుచరులపై శ్యామలాదేవి అనే మహిళా రాష్ట్ర మానవహక్కుల  సంఘంలో సోమవారం ఫిర్యాదు చేశారు. మంత్రికి చెందిన కళాశాలకు ఆసుపత్రికి మద్యన తనకు 1.33 ఎకరాల పట్టాభూమి ఉందని, తాము ఇచ్చిన డబ్బు తీసుకొని దానిని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలని మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి చాలా రోజులుగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ వేధింపులు భరించలేక తన తల్లి మరణించారని ఆమె పిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి కుమారుడు, వారి అనుచరులు తనను లారీతో తొక్కించి చంపేస్తామని బెదిరిస్తున్నారని, వారి వేధింపులు భరించలేకపోతున్నానని శ్యామలాదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

మల్లారెడ్డి మంత్రి కనుక వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె ఫిర్యాదు చేశారు. మంత్రి కుమారుడు, అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని కనుక వారిపై తక్షణం చర్యలు తీసుకోవలసింది బాధితురాలు శ్యామలాదేవి రాష్ట్ర మానవహక్కుల  సంఘాన్ని కోరారు. మంత్రి మల్లారెడ్డి ఈ పిర్యాదుపై ఇంకా స్పందించవలసి ఉంది. ఒకవేళ ఆమె చెపుతున్నది నిజమైతే, మానవహక్కుల  సంఘం కంటే ముందు సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌, హోంమంత్రి మహమూద్ అలీ దీనిపై స్పందిస్తే హుందాగా ఉంటుంది.


Related Post