రాష్ట్రానికి రాజైనా చిన్ననాటి దోస్తును మరిచిపోలేదు

February 14, 2020


img

కేసీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలను ఏవిధంగా శాశిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే ప్రభుత్వాన్ని..దానిలో అధికారులను ఏవిధంగా నడిపిస్తున్నారో చూస్తున్నాము.. అటు ప్రభుత్వాన్ని..ఇటు పార్టీని ఒంటి చేత్తో ఎంతో సమర్ధంగా నడిపిస్తూ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధిచేస్తూ యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రప్రభుత్వం సైతం ఆదర్శంగా తీసుకొందంటే కేసీఆర్‌ గొప్పదనం ఏమిటో అర్ధమవుతుంది. అటువంటి కేసీఆర్‌ను  కలిసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నతాధికారులు క్యూ కడుతుంటారు. ఇక సామాన్యులకు ఆయనను కలిసే అవకాశం ఉంటుందనుకోలేము. కానీ కేసీఆర్‌ చిన్ననాటి స్నేహితుడైన సంపత్‌కు ఆ గౌరవం దక్కింది. 

సిఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన కోసం కరీంనగర్‌ వస్తున్నారని తెలుసుకొని ఆయన చిన్ననాటి స్నేహితుడు సంపత్ అక్కడకు చేరుకొన్నారు. కానీ కేసీఆర్‌ భద్రతాసిబ్బంది ఆయనను అనుమతించకపోవడంతో నిస్సహాయంగా అక్కడే దూరంగా నిలబడిపోయారు. సిఎం కేసీఆర్‌ ఆయనను గుర్తుపట్టి పిలవడంతో భద్రతాసిబ్బంది ఆయనను కేసీఆర్‌ వద్దకు తోడ్కొని తీసుకువచ్చారు. సిఎం కేసీఆర్‌ తన బాల్య స్నేహితుడిని ఆప్యాయంగా కౌగలించుకొని కుశలప్రశ్నలు అడిగి, అక్కడున్న మంత్రులు, ఉన్నతాధికారులు అందరికీ ఆయనను పరిచయం చేశారు. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినా తనను... తన పేరును కూడా గుర్తుపెట్టుకొని ఈవిధంగా గౌరవించినందుకు సంపత్ చాలా ఆనందంతో పొంగిపోయారు.


Related Post