త్వరలో కాజీపేట-బలార్షా రైల్వే ట్రాక్ కోసం భూసేకరణ

February 13, 2020


img

ప్రధాని నరేంద్రమోడీ ప్రతీ మూడునెలలకు ఒకసారి ‘ప్రగతి వేదిక’ పేరుతో దేశంలో జరుగుతున్న పలు ప్రాజెక్టులపై ఆయా రాష్ట్రాల సంబందిత అధికారులతో చర్చించి పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకొంటుంటారు. ఇటీవల నిర్వహించిన ప్రగతి వేదిక కార్యక్రమంలో ఈసారి కాజీపేట-బలార్షా మద్య 202 కిమీ పొడవుండే 3వ రైల్వే ట్రాక్ ఏర్పాటుకు సంబందించి రాష్ట్ర అధికారులతో చర్చించారు. భూసేకరణకు పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణశాఖ కార్యదర్శి, రైల్వేకు సంబందించిన పనుల కోసం దక్షిణమద్య రైల్వే ఉన్నతాధికారి, భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నతాధికారితో ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని పార్లమెంటులో సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేస్తూ ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి రైల్వేశాఖకు అప్పగించాలని ప్రధాని నరేంద్రమోడీ ఆదేశించారు. భవిష్యత్‌లో ఇటువంటి పనుల కోసం భూసేకరణ చేసేందుకు వీలుగా ‘మోడల్‌ యాక్ట్‌ ఫర్‌ రైట్‌ టూ యూజ్‌’ అనే విధానాన్ని రూపొందించి అన్ని రాష్ట్రాలకు ఆ వివరాలను పంపించాలని ప్రధాని నరేంద్రమోడీ అధికారులను ఆదేశించారు. 

2022 లోగా సికింద్రాబాద్‌-నాగపూర్ మద్య సెమీ హైస్పీడ్, సికింద్రాబాద్‌ నుంచి పూణే మీదుగా ముంబైకి హైస్పీడ్  రైళ్ళను ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దానికి సంబందించి సర్వే పనులు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. 


Related Post