సచివాలయం కూల్చివేతపై స్టే పొడిగింపు

February 12, 2020


img

ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయం నిర్మించాలని సిఎం కేసీఆర్‌ భావించి దాని కోసం శంఖుస్థాపన కూడా చేశారు. కానీ సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవడం ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేకపోయింది. ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించాలనుకొన్నప్పుడు దానికి సంబందించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఇదివరకే హైకోర్టు ఆదేశించింది. కానీ ఈరోజు జరిగిన విచారణలో కూడా ఆ వివరాలను సమర్పించకపోవడంతో, ఆ డిజైన్లు, నివేధికలు సిద్దంకానప్పుడు పాత సచివాలయం కూల్చివేతకు తొందరెందుకు?అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కనుక తదుపరి ఆదేశాల వరకు పాత సచివాలయం కూల్చకుండా స్టే పొడిగిస్తున్నట్లు తెలిపారు.      

పాత సచివాలయం కూల్చివేసి ఆ శిధిలాలను తొలగించి మళ్ళీ కొత్త సచివాలయం నిర్మించడానికి సుమారు రూ.400-500 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. సిఎం కేసీఆర్‌ తలుచుకొంటే ఇంత ఆలస్యం ఎప్పుడూ చేయరు. కానీ ఆర్ధికసమస్యల కారణంగా ఎన్నికల హామీలనే అమలుచేయలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం, కొత్త సచివాలయం కోసం అంత సొమ్ము కేటాయించడం కాస్త కష్టమే. కనుక పరిస్థితులు మళ్ళీ చక్కబడేవరకు ఈ ప్రతిపాదనను వాయిదా వేయాలనుకొంటోందేమో?


Related Post