జేపీ నడ్డా ఖాతాలో తొలి పరాజయం

February 11, 2020


img

డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గెలిచి ఉండి ఉంటే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డాకు మంచి ఆరంభంగా ఉండేది కానీ పార్టీ ఓటమితో తొలిసారిగా చేదు అనుభవం రుచి చూడవలసి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓటమిపై స్పందిస్తూ, “ప్రజా తీర్పును గౌరవిస్తున్నాము. ప్రతిపక్ష బెంచీలలో కూర్చొని నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాము. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేస్తాము. ఈ ఎన్నికలలో పార్టీ  కోసం రేయింబవళ్లు పనిచేసిన నేతలకు, పార్టీ కార్యకర్తలు అందరికీ పేరుపెరుణా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు. డిల్లీ కేంద్రంగా యావత్ దేశాన్ని శాశిస్తున్న బిజెపి ఒక ప్రాంతీయ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ చేతిలో వరుసగా 3వ సారి ఓడిపోవడం ఆశ్చర్యకరమే. కేంద్రప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను ప్రవేశపెట్టడమే కొంప ముంచిందని చెప్పవచ్చు. డిల్లీ ప్రజలు ముఖ్యంగా... కాలేజీ, యూనివర్సిటీ విద్యార్దులు, యువత, ముస్లింలు దానిని తీవ్రంగా వ్యతిరేకించడం, ఆమ్ ఆద్మీ వారందరికీ అండగా నిలబడి దానిని ఓ గొప్ప అవకాశంగా మలుచుకొందని చెప్పవచ్చు. 




Related Post