కేజ్రీవాల్‌ మళ్ళీ ఊడ్చేస్తున్నారు

February 08, 2020


img

శనివారం సాయంత్రం 6 గంటలకు డిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. విద్యావంతులు, ఉన్నతాదాయవర్గాలు, రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే దేశరాజధాని డిల్లీలో ఇవాళ్ళ జరిగిన పోలింగులో కేవలం 58 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. డిల్లీ అసెంబ్లీలో 70 సీట్లకు మొత్తం 672 మంది పోటీ పడ్డారు. పోలింగ్ ముగియగానే వివిద మీడియా సంస్థలు తమ సర్వే ఫలితాలను ప్రకటించాయి. దాదాపు అన్ని సంస్థలు మళ్ళీ ఆమాద్మీ పార్టీయే గెలిచి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పాయి. అంతేకాదు.. అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయి ఘోరపరాజయం పాలవబోతోందని ముక్తకంఠంతో జోస్యం చెప్పడం విశేషం.

టైమ్స్ నౌ: ఆమాద్మీ-44, బిజెపి-26 స్థానాలు 

న్యూస్ ఎక్స్‌ప్రెస్‌: ఆమాద్మీ-53-57, బిజెపి-11-17,ఇతరులు 0-2 స్థానాలు

పీపుల్స్ పల్స్ ప్రెడిక్షన్: ఆమాద్మీ-54-59, బిజెపి-9-15 

కనుక ఆమాద్మీ అధినేత, డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ తన పార్టీ గుర్తు అయిన చీపురుకట్టతో ఈసారి కూడా కాంగ్రెస్‌, బిజెపిలను ఊడ్చిపారేయబోతున్నారన్నమాట! డిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేసే జాతీయపార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లు ఆమాద్మీని ఓడించలేక చతికిల పడుతుండటం ఆశ్చర్యకరమే. చక్కటి పరిపాలన అందిస్తే ఆ పార్టీని ప్రజలు నెత్తిన పెట్టుకొంటారని చెప్పడానికి ఇదే తాజా ఉదాహరణగా నిలుస్తుంది.


Related Post