రాహుల్ రామకృష్ణ ట్రాజెడీ ఫ్లాష్ బ్యాక్

January 21, 2020


img

తెలుగు సినీపరిశ్రమలో రాహుల్ రామకృష్ణ గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తి లేదు. కమీడియన్, హీరో దోస్త్ రోల్స్ ఎక్కువగా కనిపిస్తూ అద్భుతమైన కమీడీ పండిస్తూ ప్రేక్షకులకు కితకితలు పెడుతుంటాడు. అందరినీ కడుపుబ్బా నవ్వించే రాహుల్ రామకృష్ణ హటాత్తుగా తన బాల్యంల ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఇంతకీ అతను ఏమి చెప్పాడంటే... “నా బాల్యంలో రేప్ చేయబడ్డాను. అప్పటి నుంచి నా మనసులో నెలకొన్న బాధను ఏవిధంగా చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉండిపోయాను. కానీ ఇప్పుడు ఈ విషయం గురించి నలుగురికి చెప్పుకోవడం ద్వారా నా గురించి నేను మరింత తెలుసుకొన్నాననిపిస్తోంది,” అని ట్వీట్ చేశాడు. కొంతమంది ఆడపిల్లలకు వారి బాల్యంలోనో లేదా వారి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు లైంగిక వేధింపులు లేదా ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. కానీ ఇప్పుడు మన సమాజంలో మగపిల్లలకు కూడా లైంగికవేధింపులకు గురవుతుండటం సమాజంలో అసహజమైన మార్పు వస్తోందని సూచిస్తోంది. హైదరాబాద్‌లో డాక్టర్ ప్రియాంకా రెడ్డి వంటి ఓ ఉన్నత విద్యావంతురాలు సామూహిక అత్యాచారానికి గురైనప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ఆమె గురించి సభ్య సమాజం సిగ్గుపడేవిధంగా కామెంట్స్ చేసిన సంగతి అందరికీ తెలుసు. కనుక                 రాహుల్ రామకృష్ణ తనకు బాల్యంలో ఎదురైన ఈ చేదు అనుభవం గురించి ఇప్పుడు బయటపెట్టడం వలన జనం, ఇండస్ట్రీ నుంచి సానుభూతి కంటే అవహేళనలే ఎదురయ్యే అవకాశం ఉంటుంది.


Related Post