కేంద్రం మరో వివాదాస్పద నిర్ణయం!

January 20, 2020


img

గత కాలంగా పాలకులు వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకొంటుండటం...వాటిని వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుండటం... అయినా ప్రభుత్వాలు వెనక్కు తగ్గకుండా ముందుకే సాగుతుండటం పరిపాటిగా మారిపోయింది. సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఇంకా చల్లారకమునుపే రైల్వేమంత్రిత్వశాఖ మరో వివాదాస్పదమైన నిర్ణయం తీసుకొంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గల అన్ని రైల్వే స్టేషన్‌లలో ఏర్పాటుచేసిన  బోర్డులపై ఉర్దూ బాషలో వ్రాసినవాటిని తొలగించి హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం బాషలలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం సంస్కృతం బాషను రెండో అధికారబాషగా ప్రకటించినందున ఈ నిర్ణయం తీసుకొన్నట్లు రైల్వేమంత్రిత్వశాఖ ప్రకటించింది. 

ఉత్తరాదిరాష్ట్రాలలో ముస్లిం జనాభా ఎక్కువ కనుక వారు చదువగలిగే ఉర్దూ బాషలో సైన్ బోర్డులు ఉండేవి. సంస్కృతం భాషను ప్రోత్సహించడం చాలా మంచిదే కానీ మెజార్టీ ప్రజలకు అర్ధంకాని బాషలో సైన్ బోర్డులు ఏర్పాటుచేయడం వలన ప్రజలను ఇబ్బందికి గురిచేసినట్లే అవుతుందని రైల్వేశాఖ గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా దీంతో ముస్లింల మనోభావాలకు దెబ్బ తగిలినట్లవుతుంది కనుక వారు ఆందోళనలు ప్రారంభించవచ్చు.


Related Post