ఓవైసీని వెంటాడుతున్న కేసులు

December 14, 2019


img

ఓవైసీ సోదరులలో అక్బరుద్దీన్ ఓవైసీ నోటి దురద గురించి అందరికీ తెలుసు. ఎన్నికల సభలలో తమ అభ్యర్ధిని గెలిపిస్తే స్థానిక ముస్లిం ప్రజలకు తమ మజ్లీస్ పార్టీ ఏమి చేస్తుందో చెప్పరు కానీ ముస్లిం ఓటర్లను ఆకట్టుకొనేందుకు మత విద్వేషాలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడుతుంటారు. 2012లో నిజామాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో కూడా అలాగే రెచ్చిపోవడంతో జైలుకు కూడా వెళ్ళారు. మళ్ళీ ఎన్నడూ మత విద్వేషాలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడనని కోర్టుకు హామీ ఇచ్చి బెయిల్‌పై బయటకు వచ్చారు. కానీ ఆ అలవాటు మాత్రం మార్చుకోలేదు. సుమారు ఏడేళ్ళ క్రితం జరిగిన ఆ కేసులో అదిలాబాద్ సెషన్స్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ కరుణాసాగర్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి అక్బరుద్దీన్ ఓవైసీకి, ఆ కేసును దర్యాప్తు చేసిన సిబిసిఐడి పోలీసులను కౌంటర్ దాఖలు చేయమని కోరుతూ నోటీసులు పంపించారు. 


Related Post