పౌరసత్వ బిల్లుపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ విమర్శలు

December 10, 2019


img

పౌరసత్వ బిల్లుపై పాక్‌ ప్రదాని ఇమ్రాన్ ఖాన్‌ స్పందిస్తూ, “భారత్‌ లోక్‌సభ ఆమోదించిన ఆ బిల్లును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అది మానవహక్కులను, భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సంబంధాలను కూడా దెబ్బతీసే విదంగా ఉంది. హిందూ రాజ్యం ఏర్పాటు కోసం ఆర్‌ఎస్ఎస్ రూపొందించిన ఆ బిల్లును ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వం అమలుచేయడానికి సిద్దం అవుతోంది,” అని ట్వీట్ చేశారు. 

పాక్‌ ప్రధాని మానవహక్కుల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. గత రెండుమూడు దశాబ్దాలుగా బలూచీస్థాన్‌లో పాక్‌ సైనికులు అక్కడి మహిళలను ఎత్తుకుపోయి అత్యాచారాలు చేసి కాల్చి పడేస్తున్నారు. పాక్‌ నుంచి విడిపోవాలని కోరుకొంటున్న బలూచ్ వేర్పాటువాదులను క్రూరంగా చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. గత దశాబ్ద కాలంలో వేలాదిమంది బలూచ్ ప్రజలు అపహరణకు గురయ్యారు. నేటికీ వారి ఆచూకీ లభించలేదు. 

భారత్‌పై ఉగ్రదాడులకు పాలపడుతున్న హఫీజ్ సయ్యద్ వంటి కరడుగట్టిన ఉగ్రవాదులను పాక్‌ పెంచి పోషిస్తున్న సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు. అమెరికా ట్విన్ టవర్స్ పై దాడికి పాల్పడి వందలాదిమంది ప్రాణాలను పొట్టన పెట్టుకొన్న కరడుగట్టిన ఉగ్రవాది బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించిన సంగతి తెలిసిందే. ఇంతగా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ భారత్‌ను వేలెత్తి చూపడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 


Related Post