సిపిఎం అభ్యర్ధిపై సస్పెన్షన్ వేటు!

October 08, 2019


img

హుజూర్‌నగర్‌ సిపిఎం అభ్యర్ధి శేఖర్ రావుపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చినప్పటికీ ఆయన నామినేషన్ పత్రాలను సరిగ్గా దాఖలు చేయకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురయింది. దాంతో ఉప ఎన్నికలలో సిపిఎం పోటీ చేయలేకపోయింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర కమిటీ శేఖర్ రావును పార్టీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సూర్యాపేట జిల్లా కార్యదర్శి రాములును కూడా దీనికి బాధ్యుడిని చేస్తూ ఆ పదవి నుంచి తప్పించింది. 

ఉప ఎన్నికలలో పోటీ చేయలేకపోతున్నందున తెలంగాణ ప్రజాపాట్రీ అభ్యర్ధి సాంబశివగౌడ్‌కు సిపిఎం మద్దతు ప్రకటించింది. ఈ ఉప ఎన్నికలలో సిపిఐ తెరాసకు మద్దతు ఇస్తోంది. సిపిఐ నిర్ణయం మార్చుకొని తెలంగాణ ప్రజాపార్టీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని సిపిఎం విజ్ఞప్తి చేసింది. Related Post