విమోచన దినోత్సవంతో బిజెపికి ఏమి సంబందం? ఉత్తమ్

September 13, 2019


img

తెలంగాణ విమోచన దినోత్సవం గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. హైదరాబాద్‌ నిజాం నవాబు తమ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు నిరాకరిస్తే అప్పుడు కేంద్రహోంమంత్రిగా వ్యవహరించిన సర్ధార్ వలబ్ భాయ్ పటేల్ భారత ఆర్మీని పంపించి నిజాం నవాబును లొంగదీసుకొని భారత్‌లో విలీనం చేయించారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్ధార్ వలభ్ భాయ్ పటేల్ ఆ పనిచేస్తే అదేదో బిజెపి చేసిన ఘనకార్యమన్నట్లు రాష్ట్ర బిజెపి నేతలు చెప్పుకొంటున్నారని, నిజానికి అప్పటికి బిజెపి పుట్టనేలేదని గ్రహించాలని ఎద్దేవా చేశారు. కనుక తెలంగాణ విమోచన దినోత్సవంతో బిజెపికి అసలు సంబందమే లేదని అన్నారు. కానీ తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట రాష్ట్ర ప్రజల మద్య చిచ్చుపెట్టి బిజెపి రాజకీయలబ్ది పొందాలనుకోంటోందని అన్నారు. అయితే రాష్ట్ర ప్రజలు బిజెపి ఉచ్చులో పడబోరని ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారనే నమ్మకం తనకు ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.   Related Post