చంద్రయాన్-2 వైఫల్యంపై పాక్‌ మంత్రి పైశాచిక ఆనందం

September 07, 2019


img

భారత్‌పై ద్వేషంతో రగిలిపోతున్న పాకిస్థాన్‌కు దానిని వ్యక్తం చేసేందుకు మరో గొప్ప అవకాశం లభించింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌వేర్‌లో ల్యాండింగ్ చేయలేకపోవడంతో పాక్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖా మంత్రి సిహెచ్ ఫాద్ హుస్సేన్, ఇస్రో శాస్త్రవేత్తలను, చంద్రయాన్-2 ప్రయోగాన్ని, భారత్‌ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోడీని అవహేళన చేస్తూ వరుసగా అనేక ట్వీట్స్ చేశారు. 

“చేతకాని పని చేయడానికి పూనుకొని భంగపడ్డావా డియర్ ఇండియా” అని ట్వీట్ చేశారు. ఇంగ్లీషులో ఇండియా స్పెల్లింగులో ‘ఐ’ అనే అక్షరానికి బదులు ‘ఇ’ అక్షరాన్ని వాడి భారత్‌పట్ల తన ద్వేషం బయటపెట్టుకున్నారు. 

“చంద్రుడికి బదులు ముంబైలో దిగింది. ఇక హాయిగా పడుకోండి సోదరులారా...” అని మరో ట్వీట్ చేశారు.    

“ఓహ్.. ఆ గొప్ప క్షణాలను నేను నిజంగా మిస్ అయ్యాను.. #ఇండియా ఫెయిల్డ్..” అని మరో ట్వీట్ చేశారు.

ఆయన ట్వీట్స్ పై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ చేయడంపై మళ్ళీ స్పందిస్తూ , “ఇండియన్స్ ట్రోలింగ్ చూసి ఆశ్చర్యపడుతున్నాను. ఆ మిషన్ ఫెయిల్ అవడానికి నేనే కారణమన్నట్లు వారు నన్ను దూషిస్తున్నారు. కానీ భాయ్... నేనేమీ అన్నానంటే అటువంటి అసమర్దులను నమ్మి 900 కోట్లు పెట్టుబడి పెట్టడం సరికాదని మాత్రమే అన్నాను. కనుక కాస్త ఓపికపట్టి ఇప్పటికైనా బంగారం కోసం అన్వేషించండి... #ఇండియా  ఫెయిల్డ్..” అని మరో ట్వీట్ చేశారు.    

విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగలేకపోవడంతో సిగ్గుతో తలదించుకుని బాధ పడుతున్న ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్రమోడీ ప్రేమతో ఆలింగనం చేసుకొని భుజం తట్టి ఓదార్చి వారికి ధైర్యం చెపుతూ అన్న మాటలను కూడా పాక్‌ మంత్రి సిహెచ్ ఫాద్ హుస్సేన్ అవహేళన చేశారు.

“నరేంద్రమోడీ తాను రాజకీయనాయకుడినని గాక వ్యోమగామిలా భావిస్తూ పెద్ద ఉపన్యాసం ఇచ్చారు. కానీ భారత్‌ పేదదేశం ఇటువంటి ప్రాజెక్టుపై 900 కోట్లు ఖర్చు ఎందుకు పెట్టిందని లోక్‌సభ ఆయనను గట్టిగా నిలదీయాలి,” అని మరో ట్వీట్ చేశారు. 

చివరిగా చంద్రయాన్-2 ప్రయోగాన్ని అవహేళన చేస్తూ, 

స్టెప్ 1: “గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్ చేసుకోండి.” 

స్టెప్ 2:  “మీరు నివసించే ప్రాంతం, నెలను ఎంచుకోండి.” 

స్టెప్ 3: “సెర్చ్ ఆప్షన్ బటన్ ఎంచుకోండి.”

స్టెప్ 5: “దానిలో మూన్ అనె బటన్‌పై ప్రెస్ చేయండి.” అంతే...మీకు చంద్రుడు కనబడతాడు...” అంటూ మరో ట్వీట్ చేశారు. 

సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖా మంత్రిగా పనిచేస్తున్న సిహెచ్ ఫాద్ హుస్సేన్ ఇంత చవుకబారుగా ట్వీట్స్ చేయడం చూసి విదేశీయులు కూడా షాక్ అవుతున్నారు. ఆయనకు భారత్‌ పట్ల ద్వేషం ఉంటే ఉండవచ్చు కానీ ఒక గొప్ప శాస్త్ర పరిశోధనకు జరుగుతున్న ప్రయత్నాలను ఈవిదంగా అవహేళన చేయడం సిగ్గుచేటు. అయినా విదేశాలు ఇచ్చే ఆర్ధిక సాయంతో  క్షిపణులు, అణుబాంబులు, ఉగ్రవాదులను మాత్రమే తయారుచేయడం నేర్చుకున్న పాకిస్తాన్ ఇంతకంటే గొప్పగా ఏమి ఆలోచించగలదు?



Related Post