దత్తన్న అంకితభావానికి అది అవార్డు వంటిది

September 03, 2019


img

మాజీ కేంద్రమంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. ఆయన నిన్న ఖైరతాబాద్ గణేశ్ పూజలో పాల్గొన్న తరువాత మీడియాతో మాట్లాడుతూ, “నాకు ఇంత అత్యున్నతమైన పదవిని ఇచ్చి గౌరవించినందుకు ప్రధాని నరేంద్రమోడీకి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఇద్దరికీ మంస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. బుదవారం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సీమ్లా చేరుకొని గురువారం గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేస్తాను,” అని తెలిపారు. 

గత ప్రభుత్వంలో కార్మికశాఖా మంత్రిగా చేసిన బండారు దత్తాత్రేయను మంత్రివర్గ ప్రక్షాళనలో పక్కనపెట్టడంతో చాలా బాధపడ్డారు. తెరాస నేతలు కూడా ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయాన్ని తప్పు పట్టారు. అయితే దత్తన్న బాధపడినప్పటికీ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి మౌనం వహించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారు. లోక్‌సభ ఎన్నికలలో కూడా ఆయనకు టికెట్ ఇవ్వనప్పటికీ పార్టీకి వ్యతిరేకంగా పల్లెత్తు మాట మాట్లాడలేదు. తన స్థానంలో సికింద్రాబాద్‌ నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన కిషన్‌రెడ్డికి పూర్తి మద్దతు ఇచ్చి ఆయన గెలుపుకోసం దత్తన్న చాలా కృషి చేశారు. పార్టీ పట్ల ఇంత అంకితభావం ఉన్నందునే ఆయనకు ఇప్పుడు ఇంతటి గౌరవం, సముచిత స్థానం లభించాయని చెప్పవచ్చు. 


Related Post