బాలీవుడ్ పై తెలుగు సినిమా దండయాత్ర.. జయహో..!

August 21, 2019


img

సౌత్ సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా అంటే ఇన్నాళ్లు కొద్దిగా చిన్నచూపు ఉండేది. కాని ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో అప్పటి నుండి లెక్కలు పూర్తిగా మారిపోయాయి. రాజమౌళి బాహుబలి సినిమాతో ఇది కదా తెలుగు సినిమా సత్తా అని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆ సినిమాతోనే బాలీవుడ్ మేకర్స్ కు షాక్ ఇచ్చారు తెలుగు దర్శక నిర్మాతలు. ఇక ఇప్పుడు అదే తరహాలో మరో రెండు సినిమాలు బాలీవుడ్ మేకర్స్ ను నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.

అందులో ఒకటి సాహో కాగా.. మరోటి సైరా నరసింహా రెడ్డి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ ఏర్పరచుకుంది. ఈ నెల 30న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు. తెలుగు తమిళ హింది కన్నడ మళయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న సాహో ప్రమోషన్స్ ను ముంబై నుండే మొదలుపెట్టారు. భారీస్థాయిలో యాక్షన్ సీక్వెన్సెస్ తో కచ్చితంగా సాహో మరోసారి సాహోరే తెలుగు సినిమా అనిపించేలా చేస్తుందని చెప్పొచ్చు.  

ఇక మెగాస్టార్ నటించిన సైరా సినిమా విషయానికొస్తే.. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా చరిత్ర మరచిన ఓ వీరుడి కథతో వస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ ప్లాన్ చేయగా సినిమా టీజర్ నిన్న ముంబైలో చిత్రయూనిట్ సమక్షంలో జరిగింది. టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సైరా మీద కూడా నేషనల్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది.

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల తరహాలో తెలుగు సినిమాలు ఎందుకు ఉండట్లేదని అనుకున్నారు.. కాని లెక్క మారింది.. తెలుగు సినిమాల స్థాయిలో బాలీవుడ్ మూవీస్ రావాలని ఆశిస్తున్నారు. సాహో, సైరానే కాదు.. నెక్స్ట్ ఇయర్ రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా అయితే మళ్లీ బాహుబలి కాదు అంతకుమించే సినిమా అవుతుందని చెప్పొచ్చు. ఓ రకంగా టాలీవుడ్ చేస్తున్న ఈ ప్రయోగాలకు బాలీవుడ్ మేకర్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని అర్ధమవుతుంది.Related Post