నేటికీ శ్రీరాముడి వారసులున్నారా?

August 12, 2019


img

హిందువుల ఆరాధ్యదైవంగా కొలిచే శ్రీరాముడికి లవకుశులనే ఇద్దరు కుమారులు ఉండేవారని తెలుసు. కానీ వారి తరువాత తరాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. రామాయణం, దానికి సంబందించి కధలు, సాక్ష్యాధారాలు, ఆలయాలు ఆసియా ఖండమంతటా నేటికీ కనబడుతున్నప్పటికీ, సుమారు 12,96,000 సంవత్సరాల క్రితం రామాయణ కాలంగా చెప్పుకుంటున్న త్రేతాయుగంనాటి వంశాలు ఇంకా ఈ భూమ్మీద నిలిచిఉంటాయని ఎవరూ అనుకోలేము.

ఉత్తరప్రదేశ్‌లోని అయోద్య-బాబ్రీ మసీదు వివాదంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టుకు ఇదే అనుమానం కలిగింది. అయోద్య ఆలయంపై హక్కులు నిరూపించుకోవడానికి శ్రీరాముడి వారసులు ఎవరైనా జీవించి ఉన్నారా? వారిలో ఎవరైనా అయోద్యలో నివసిస్తున్నారా? వారు శ్రీరాముడి వారసులేనని నిరూపించేందుకు స్కాక్ష్యాధారాలు ఏవైనా ఉన్నాయా?” అని అయోద్యలో  రామమందిరం నిర్మించాలని వాదిస్తున్నవారిని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ప్రశ్నే విచిత్రమనుకుంటే దానికి ‘శ్రీరాముడి వారసులున్నారు’ అనే సమాధానం వినబడటం ఇంకా ఆశ్చర్యకరం. 

ప్రస్తుతం బిజెపి లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న జైపూర్ రాజవంశీకురాలు దియా కుమారి తాము శ్రీరఘురాముడి వంశస్తులమేమని చెప్పారు. తమ కుటుంబం శ్రీరాముడి రెండవ కుమారుడైన కుశుని వంశానికి చెందినదని ఆమె తెలిపారు. ఇందుకు సబందించిన సాక్ష్యాధారపత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని ఆమె న్యాయస్థానానికి తెలియజేశారు. తాము ఒక్కరమే కాదు... శ్రీరాముడికి ప్రపంచవ్యాప్తంగా అనేకమంది వారసులున్నారని ఆమె తెలిపారు.భారత్‌ మరియు ప్రపంచ దేశాలలో కచ్వా, రాజవత్, షేఖావత్,షియోబ్రహ్మపుత్ర, నరుక, నహావత్, ఖాంగారోట్, కుంభానీ అనే 72 వంశాలవారు శ్రీరాముడి రెండవ కుమారుడైన కుశుని వారసులుగా చెప్పుకొంటున్నారు. వాటిలో ఒకటి తమదని దియా కుమారి న్యాయస్థానానికి తెలిపారు.       


Related Post