మమతక్క సర్కారుకు బిజెపి స్పాట్ పెట్టేసిందా?

July 13, 2019


img

ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ద్వితీయస్థానంలో ఉన్న ముకుల్ రాయ్ ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీతో విభేదించి బిజెపిలో చేరారు. కనుక ఆయనకు తృణమూల్ కాంగ్రెస్ నేతలందరితో మంచి పరిచయాలున్నాయి. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లు ఆయన బిజెపిలో చేరడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గుట్టు, మమతా బెనర్జీ ప్రభుత్వంలోని సమస్యలు, లోపాలు, అసంతృప్తి నేతల సమాచారం అంతా బిజెపికి చేరిపోయింది. 

తాజాగా ముకుల్ రాయ్ ఒక బాంబు పేల్చాడు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌తో సహా కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు బిజెపితో టచ్చులో ఉన్నారని ప్రకటించారు. ఇది సిఎం మమతా బెనర్జీకి తన పార్టీ ఎమ్మెల్యేలపై అనుమానం రేకెత్తించి వారిలో చిచ్చు పెట్టడానికే ఆడుతున్న మైండ్ గేమా లేక నిజంగానే తృణమూల్ ఎమ్మెల్యేలను బిజెపివైపు తిప్పుకోవడానికి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనేది త్వరలోనే తేలిపోవచ్చు. ఏది ఏమైనపటికీ మమతా బెనర్జీ సర్కారుకు బిజెపి స్పాట్ పెట్టేసినట్లే ఉంది. బిజెపి విసురుతున్న ఈ సవాలును మమతా బెనర్జీ ఏవిధంగా ఎదుర్కోగలరో చూడాలి.



Related Post