త్వరలో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

July 11, 2019


img

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన పురపాలక చట్టానికి ఆమోదం తెలిపేందుకు ఈనెల 18,19 తేదీలలో రెండురోజుల పాటు శాసనసభ ప్రత్యేకసమావేశాలు నిర్వహించలాని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టానికి సంబందించి ముసాయిదా బిల్లు (డ్రాఫ్ట్ కాపీ)ని న్యాయశాఖ పరిశీలన, ఆమోదం కొరకు పంపింది. ఈనెల 17లోగా అది మళ్ళీ ప్రభుత్వం చేతికి వస్తుంది. జూలై 18న దానిని శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టి దానిపై చర్చ జరుపుతారు. మరుసటిరోజున దానికి ఉభయసభలు ఆమోదం తెలుపుతాయి. కొత్తపురపాలక చట్టం అమలులో వచ్చే సమయానికే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది కనుక కొత్త చట్టంలో నిబందనలన్నీ వాటికి వర్తిస్తాయి.  Related Post