హమ్మయ్యా ... తేల్చేశాడు!

June 25, 2019


img


సస్పెన్స్ ఉంటేనే ఏదైనా అందరికీ ఆసక్తి కలిగిస్తుంది. కానీ అసలు విషయం ఏమిటో ముందే తెలిసిపోయిన తరువాత ఎదురుచూడటం అంటే ఒక సినిమాను పదవసారి చూస్తున్నంత బోరింగ్ గా ఉంటుంది. మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నారనే విషయం అందరికీ తెలిసిపోయినప్పటికీ, గత రెండు వారాలుగా ఆయన వ్యవహారం బెల్లంపాకంలాగ సాగుతుండటంతో జనాలు దానిపై ఆసక్తి కోల్పోయారు. అయితే అందరికీ తెలిసిన ఆ వ్యవహారానికి మంగళవారం ఆయనే స్వయంగా ముగింపు పలికారు. 

డిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఆర్ధిక ఇబ్బందుల వలన నేను పార్టీ మారుతున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్లు విన్నాను. అదే కారణమయితే గతంలో తెరాస నుంచి ఆహ్వానం వచ్చినప్పుడే ఆ పార్టీలో చేరిపోయేవాడిని. సిఎం కేసీఆర్‌ నియంతృత్వపాలన అంతమోదించాలనే ఏకైక లక్ష్యంతో నేను బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నాను. నేను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ, నా నియోజకవర్గం ప్రజలకు ఏమీ చేయలేకపోయాను. నేను పార్టీ మారాలనుకోవడానికి ఇది మరొక కారణం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెరాసను ఎదిరించి పోరాడే స్థితిలో లేదు. ఒక్క బిజెపి మాత్రమే తెరాసను డ్డీకొని దానికి ప్రత్యామ్నాయంగా నిలబడగలదని భావించి ఆ పార్టీలో చేరుతున్నాను. నా సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదా? అనేది ఆయన వ్యక్తిగత విషయం. నేను మాత్రం కేసీఆర్‌ను గద్దె దింపేందుకే బిజెపిలో చేరుతున్నాను.” అని అన్నారు. Related Post