కేసీఆర్‌పై జీవన్ రెడ్డి కామెంట్స్

June 18, 2019


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మళ్ళీ సిఎం కేసీఆర్‌ను ఏపీ సిఎం జగన్‌తో పోల్చి చూపుతూ విమర్శలు గుప్పించారు. ఉద్యోగుల జీతాల పెంపు, సంక్షేమ పధకాల హామీల అమలు విషయంలో కేసీఆర్‌ కంటే జగన్‌ చాలా చక్కగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా వైసీపీలో చేరదలిస్తే వారిచేత ముందుగా వారి పదవులకు రాజీనామాలు చేయిస్తానని జగన్ చెప్పడాన్ని జీవన్ రెడ్డి హర్షించారు. కేసీఆర్‌ కంటే జగన్ వయసులో చిన్నవాడైనప్పటికీ చాలా హుందాగా, ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరిస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు. జగన్‌ను చూసి కేసీఆర్‌ నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఫిరాయింపుల విషయంలో జగన్ చెప్పిన మాటలు కేసీఆర్‌కు కనువిప్పు కలిగించేలా ఉన్నాయన్నారు.

ఒకవేళ జగన్‌మోహన్‌రెడ్డి నిజంగానే అన్నమాటకు కట్టుబడి వైసీపీలో చేరేందుకు వచ్చే ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయిస్తే అప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌ను విమర్శించేందుకు మరింత అవకాశం లభిస్తుంది కనుక  కేసీఆర్‌కు ఇంకా ఇబ్బందికరంగా మారవచ్చు.


Related Post