ఎగ్జిట్‌ పోల్స్‌తో అది సాధ్యం కాదు

May 21, 2019


img

చివరిదశ ఎన్నికలు ముగిసేవరకు కాంగ్రెస్‌, బిజెపిలలో దేనికీ మెజార్టీ రాదనే టాక్ గట్టిగా వినిపించేది. కానీ అందుకు భిన్నంగా బిజెపి మళ్ళీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ జోస్యం చెప్పడంతో ప్రతిపక్షాలలో కలకలం మొదలైంది. ఎగ్జిట్‌ పోల్స్‌ కాకి లెక్కలేనాని వాటిని నమ్మబోమని వాదిస్తున్నాయి. కానీ ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడిన తరువాత కాంగ్రెస్‌ మిత్రపక్షాలలో భయం మొదలైందని బిజెపి వాదిస్తోంది. అందుకు బలమైన కారణం కూడా చూపుతోంది. సోనియా-మాయావతి భేటీ రద్దవడం, ఫలితాలు వెలువడిన తరువాతే భవిష్యకార్యాచరణ గురించి ఆలోచిద్దామని మమతా బెనర్జీ, స్టాలిన్ చెప్పడం అందుకు ఉదాహరణగా చూపుతోంది.

అయితే ఈ పరిణామాలనే ప్రతిపక్షాలు వేరే కోణంలో నుంచి చూపుతున్నాయి. ఓటమి ఖాయమని గ్రహించిన బిజెపి, మీడియాపై ఒత్తిడి తెచ్చి ఎగ్జిట్‌ పోల్స్‌ తనకు అనుకూలంగా వచ్చేలా చేసిందని, తద్వారా ఇంతవరకు ఐక్యంగా ఉన్న ప్రతిపక్షాలలో చీలికలు తెచ్చి ఆకర్షించి, వారి మద్దతు కూడగట్టుకోవాలని కపటపన్నాగం పన్నిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌తో తమ మద్య చిచ్చుపెట్టి విడదీయాలనే బిజెపి ప్రయత్నాలు ఫలించవని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఎన్నికలు పూర్తయ్యేవరకు జరిగిన రాజకీయాలు ఒక ఎత్తైతే, ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ రాజకీయాలు మరొక ఎత్తులా కనిపిస్తున్నాయి. 


Related Post