మోడీ మళ్ళీ ప్రధాని అయితే రాహుల్ పరిస్థితి ఏమిటి?

May 20, 2019


img

యూపీయే 10 ఏళ్ళపాటు అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీని పిలిచి ప్రధాని పదవి ఇస్తానంటే వద్దన్నారు. సమయం మించిపోయిన తరువాత సై అన్నారు కానీ మళ్ళీ ఆ భాగ్యం దక్కలేదు. గత ఐదేళ్ళు ప్రధాని మోడీని తిట్టుకొంటూ ఎలాగో కాలక్షేపం చేసి, ఈ ఎన్నికలలో గెలుపుకోసం చాలా కొట్లాడారు కానీ మళ్ళీ మోడీయే అధికారం చేపట్టబోతున్నారని సర్వేలన్నీ ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి. అవి నిజమో కాదో మరో మూడు రోజులలో తేలిపోతుంది. కానీ అవి చెప్పినట్లు ఒకవేళ మళ్ళీ మోడీయే మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు రాహుల్ పరిస్థితి ఏమిటి?

మళ్ళీ మరో 5 ఏళ్ళపాటు నరేంద్రమోడీని తిట్టుకొంటూ కాలక్షేపం చేస్తారా లేక అక్క ప్రియాంకా వాద్రాకు పార్టీని అప్పజెప్పి రాజకీయాల నుంచి తప్పుకొని పెళ్లి చేసుకొని ప్రశాంతంగా జీవిస్తారా? అంటే పెళ్ళి చేసుకొన్నా రాజకీయాలలోనే కొనసాగే అవకాశాలున్నాయి. ఎందుకంటే గెలిచినా ఓడినా ప్రజలలో ఉండే ఆ గుర్తింపు, గౌరవ మర్యాదలు, వాటి వలన కలిగే ఆ ‘కిక్కు’ రాజకీయాల నుంచి తప్పుకొంటే ఉండవు. గత ఐదేళ్ళుగా వేచి చూస్తే దేశప్రజలలో మోడీ పట్ల కొంత వ్యతిరేకత ఏర్పడింది. చంద్రబాబు వంటి కొత్త మిత్రులు దొరికారు. కనుక మరో 5 ఏళ్ళు వేచి చూస్తే ఏమైనా జరుగవచ్చు. అప్పటికి మోడీ పట్ల దేశ ప్రజలలో పూర్తి విముఖత ఏర్పడవచ్చు. లేదా ఏదైనా అద్బుతం జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు. కనుక ఒకవేళ ఈసారి కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేకపోతే రాహుల్ బాబా రఫెల్ యుద్ధ విమానం వేసుకొని ఆర్నెలకోసారి దేశమంతా చుట్టివస్తూ కాలక్షేపం చేయకతప్పదు. 


Related Post