మోడీని బిజెపి పక్కన పెట్టగలదా?

May 08, 2019


img

ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని ఎంపీ సీట్లు సాధించలేకపోవచ్చునని బిజెపి నేతలే భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌, బిజెపిలలో బిజెపియే ఎక్కువ సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా నిలుస్తుందనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. కనుక బిజెపి మళ్ళీ అధికారం దక్కించుకోవాలనుకొంటే తెరాస, బిజేడీ వంటి ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం ఉండవచ్చునని అందుకే ప్రధాని నరేంద్రమోడీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ఇప్పటి నుంచే ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 

కానీ ఒకవేళ బిజెపికి ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమైతే వాటికి ప్రధాని నరేంద్రమోడీ పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగా ఆయనను పక్కన పెట్టి మరెవరినైనా ప్రధానిగా నియమించేమాటయితేనే మద్దతు ఇస్తామని చెపితే, బిజెపి నరేంద్రమోడీని పక్కన పెట్టి వాటి మద్దతు తీసుకొంటుందా? లేక నరేంద్రమోడీ కనుసన్నలలలో నడుస్తున్న కారణంగా వాటి మద్దతు నిరాకరించి ప్రతిపక్షంలో కూర్చోంటుందా? అంటే రెండవ దానికే సిద్దపడవచ్చు. ఎందుకంటే, ఇంతవరకు ఎదురులేకుండా పరిపాలించిన నరేంద్రమోడీ, ప్రాంతీయ పార్టీల డిమాండ్లు, బెదిరింపులకు తలొగ్గి స్వేచ్ఛగా పరిపాలించలేరు. సొంతంగా బలం లేకుండా ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వం నడుపడమంటే తుమ్మితే ఊడిపోయే ముక్కును పట్టుకొన్నట్లే లెక్క. కనుక పూర్తి మెజారిటీ లేకపోతే బిజెపి ప్రతిపక్షంలో కూర్చోనేందుకే సిద్దపడవచ్చు.

గత ఎన్నికలలో నరేంద్రమోడీ కారణంగానే బిజెపి గెలిచి అధికారంలోకి వచ్చింది. కానీ ఒకవేళ ఈ లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ఓడిపోతే అందుకు నరేంద్రమోడీయే కారణమవడం విశేషం.


Related Post