ఇంతకీ ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎవరో?

March 23, 2019


img

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో ఖమ్మం నుంచి గాయత్రి రవిని అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో రేణుకా చౌదరిని పోటీ చేయించే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా చెప్పారు. ఖమ్మం తెరాస సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెరాస టికెట్ కేటాయించకపోవడంతో ఆయన పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహాగానాలు వినిపించాయి. గాయత్రి రవిని ఖమ్మం అభ్యర్ధిగా ప్రకటించిన తరువాత రేణుకా చౌదరి పేరు పరిశీలిస్తున్నామని కుంతియా చెప్పడం బహుశః పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేందుకే  అయ్యుండవచ్చు. ఇప్పటికీ ఖమ్మం అభ్యర్ధిని మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని కనుక పార్టీ మారే ఆలోచన ఉన్నట్లయితే తక్షణమే గోడ దూకేయాలని పొంగులేటికి కాంగ్రెస్‌ సంకేతాలు పంపిస్తున్నట్లు భావించాలేమో? Related Post