దేశంలో నెంబర్ 1 సిఎం: కేసీఆర్‌

March 22, 2019


img

 దేశంలో వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని కనుగొనేందుకు సీఓటర్-ఐఏఎన్‌ఎస్ చేసిన తాజా సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలో నెంబర్ 1 సిఎంగా నిలిచారు. రాష్ట్రంలో 20,827 మందిని సిఎం కేసీఆర్‌ పనితీరుపై ప్రశ్నించినప్పుడు 68.3 శాతం ప్రజలు చాలా సంతృప్తి వ్యక్తం చేయగా, 20.8 శాతం మంది కొంతవరకు సంతృప్తి వ్యక్తం చేశారు. 9.9 శాతం మంది సిఎం కేసీఆర్‌ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వే నివేదికలో పేర్కొంది.

కేసీఆర్‌ తరువాత స్థానాలలో వరుసగా హిమాచల్ ప్రదేశ్ సిఎం జైరాం ఠాకూర్, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్, డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. కనీసం 80 శాతం ప్రజలు సంతృప్తి చెందితేనే మంచి పాలన అందించినట్లు చెప్పుకొనే ఆంధ్రప్రదేశ్‌ సిఎం చంద్రబాబునాయుడుకి కేవలం 41.7 శాతంతో 14వ స్థానంలో నిలిచారు. ఉత్తరాఖండ్ సిఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఈ జాబితాలో చిట్టచివరి స్థానంలో నిలిచారు. 

రాష్ట్రం

చాలా సంతృప్తి       (శాతం)  

కొంత సంతృప్తి (శాతం)

తీవ్ర అసంతృప్తి (శాతం)

సర్వేలో పాల్గొన్నవారి సంఖ్య   

తెలంగాణ

68.3

20.8

9.9

20,827

హిమాచల్ ప్రదేశ్

58.3

25.4

15.3

8,249

ఒడిశా

55.5

26.7

17.3

19,161

డిల్లీ

51.9

28.5

18.9

9,893

ఛత్తీస్ ఘర్

43.3

22.8

8.7

15,162

బీహార్

47.0

30.3

22.2

24,569

కర్ణాటక

36.9

35.6

25.4

15,063

ఈశాన్య రాష్ట్రాలు

34.9

27.9

16.7

2,234

పశ్చిమ బెంగాల్

39.7

32.8

26.9

23,835

అస్సోం

36.5

3507

26.8

13,175

గుజరాత్

44.2

27.8

27.3

16,459

రాజస్థాన్

43.0

22.9

22.2

16,604

హర్యానా

46.4

24.1

28.9

12,347

ఆంధ్రప్రదేశ్‌

41.7

28.2

28.6

19,900

మధ్యప్రదేశ్

42.0

20.2

21.6

19,512

మహారాష్ట్ర

35.0

31.5

32.6

31,928

పంజాబ్

22.8

43.2

33.3

15,180

ఝార్ఖండ్

31.0

34.1

33.4

19,620

కేరళ

40.5

22.3

36.4

21,860          

ఉత్తరాఖండ్

25.1

36.2

36.4

14,656Related Post