ఏపీ టిడిపి-వైసీపీ లోక్‌సభ అభ్యర్ధుల జాబితా

March 19, 2019


img

ఏపీలో 25 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న జరుగబోయే ఎన్నికలలో ఈసారి కూడా పోటీ ప్రధానంగా టిడిపి- వైసీపీల మద్యనే ఉండబోతోంది. రెండు పార్టీలు తమ తమ అభ్యర్ధుల జాబితాలను విడుదల చేశాయి. టిడిపి సోమవారం రాత్రి తుది జాబితాను విడుదల చేసింది. దానిలో 10 మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ టికెట్లు లభించాయి. ప్రముఖ నటుడు, ఎంపీ మురళీమోహన్ ఈసారి ఎన్నికలలో పోటీ చేయకూడదని నిశ్చయించుకోవడంతో ఆయన కోడలు రూపకు రాజమహేంద్రవరం (రాజమండ్రి) టికెట్ కేటాయించారు. ఇటీవల టిడిపిలో చేరిన మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్‌ నేత పనబాక లక్ష్మికి తిరుపతి (ఎస్సీ) టికెట్ కేటాయించారు. ఈసారి అశోక్ గజపతిరాజు ఎన్నికలలో పోటీ చేయడంలేదని మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ ఆయన విజయనగరం నుంచి పోటీ చేయబోతున్నట్లు టిడిపి జాబితాతో స్పష్టం అయ్యింది.

                          టిడిపి-వైసీపీ లోక్‌సభ అభ్యర్ధుల వివరాలు: 

నియోజకవర్గం

టిడిపి

వైసీపీ

శ్రీకాకుళం

రామ్మోహన్ నాయుడు

దువ్వాడ శ్రీనివాస రావు

విజయనగరం

అశోక్ గజపతి రాజు

బి చంద్రశేఖర్

విశాఖపట్నం

భరత్

ఎం.వీ.వీ.సత్యనారాయణ

అనకాపల్లి

ఆడారి ఆనంద్

డాక్టర్ సత్యవతి

కాకినాడ

సిహెచ్ సునీల్

వంగా గీత

అమాలాపురం (ఎస్సీ )

గంటి హరీష్

చింతా అనురాధ

రాజమహేంద్రవరం

మాగంటి రూప

ఎం. భరత్

నర్సాపురం

వివి శివరామ రాజు

రఘురామ కృష్ణరాజు

ఏలూరు

మాగంటి బాబు

కోటగిరి శ్రీధర్

మచిలీపట్నం

కొనకళ్ళ నారాయణ

బాలశౌరి

విజయవాడ

కేశినేని వెంకటేశ్వర్లు (నాని)

పొట్లూరి వరప్రసాద్

గుంటూరు

గల్లా జయదేవ్

ఎం. వేణుగోపాల్ రెడ్డి

నరసారావుపేట

రాయపాటి సాంబశివరావు

ఎల్.కృష్ణదేవరాయలు

బాపట్ల (ఎస్సీ)

శ్రీరామ్ మాల్యాద్రి

ఎన్.సురేశ్  

ఒంగోలు

శిద్దా రాఘవరావు

మాగుంట శ్రీనివాసుల రెడ్డి

కడప

సీహెచ్ ఆదినారాయణ రెడ్డి

అవినాష్ రెడ్డి

నెల్లూరు

బీద మస్తాన్ రావు

ఆదాల ప్రభాకర్ రెడ్డి

నంద్యాల

ఎం. శివానంద రెడ్డి

పి బ్రహ్మానంద రెడ్డి

కర్నూలు

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

డాక్టర్ సంజీవ్ కుమార్

రాజంపేట

డికె సత్యప్రభ

మిధున్ రెడ్డి

అనంతపురం

జెసి పవన్ కుమార్ రెడ్డి

టి రంగయ్య

హిందూపురం

నిమ్మల కిష్టప్ప

గోరంట్ల మాధవ్

తిరుపతి (ఎస్సీ)

పనబాక లక్ష్మి

బి. దుర్గాప్రసాద్

చిత్తూరు (ఎస్సీ)

ఎన్.శివప్రసాద్  

రెడప్ప

అరకు (ఎస్టీ)

వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌

జి మాధవిRelated Post