వివేకానందరెడ్డి పోస్ట్ మార్టం రిపోర్ట్ వివరాలు

March 15, 2019


img

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి ఈరోజు తెల్లవారుజామున పులివెందులలో తన నివాసంలో అనుమానస్థితిలో చనిపోయిన సంగతి తెలిసిందే. పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పోస్ట్ మార్టంలో దిగ్భ్రాంతికరమైన అంశాలు బయటపడ్డాయి. ఆయన ఒంటిపై ఏడు కత్తిపొట్లున్నాయి. ఆ కత్తిపోట్ల కారణంగా తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన చనిపోయినట్లు పోస్ట్ మార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. పోస్ట్ మార్టం అనంతరం పోలీసులు ఆయన శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

వివేకా మృతిపై అనుమానాలు తలెత్తడంతో సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈకేసును దర్యాప్తు చేసేందుకు స్పెషల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలం నుంచి పోలీస్ క్లూస్ టీం వేలిముద్రలు,ఇతర ఆధారాలు సేకరించగా, మరో బృందం స్నిఫ్ఫర్ డాగ్స్ సాయంతో పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ హత్య జరగడంతో దీనిపై అప్పుడే వైసీపీ-టిడిపి నేతల మద్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా మొదలైపోయాయి.


Related Post