రెండు కాదు నాలుగు స్థానాల్లో పోటీ: కోదండరాం

March 13, 2019


img

తెలంగాణ జనసమితి రెండు స్థానాలలో పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ నేతలు మీడియాకు చెప్పారు. కానీ నాలుగు స్థానాలలో పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం బుదవారం ప్రకటించారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, మల్కాజ్‌గిరి నియోజకవర్గాలలో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. తాము పోటీ చేయబోయే మరొక నియోజకవర్గం పేరు, అభ్యర్ధులను ఒకటి రెండు రోజులలోనే ప్రకటిస్తాము. మేము పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతాము. ఇతర నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీతో సహా ఏ పార్టీతోనూ ఎన్నికల పొత్తులు పెట్టుకోబోము,” అని చెప్పారు. 

అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం వలన రెండు పార్టీలు నష్టపోయాయి. ఈసారి నాలుగు నియోజకవర్గాలలో రెండూ పోటీ పడబోతున్నందున ఓట్లు చీలి రెండూ మళ్ళీ నష్టపోయే ప్రమాదం ఉంది. తెరాస 16 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలుచుకొంటామని ఎంతో నమ్మకంతో చెపుతున్నప్పుడు కాంగ్రెస్‌, టిజేఎస్‌లు తెరాసను ఎదుర్కొనేందుకు బలమైన వ్యూహాలు రచించుకొని ఎదుర్కొనే ప్రయత్నాలు చేయకుండా, వాటిలో అవే పోటీపడుతూ మళ్ళీ మరో పెద్ద తప్పు చేస్తున్నాయని చెప్పవచ్చు. టిజేఎస్‌ బరిలో దిగడం వలన కాంగ్రెస్ పార్టీకి నష్టం, తెరాసలు లాభం కలగడం తధ్యం. 


Related Post