ఈ 13 గ్రామాల ప్రత్యేకత గురించి విన్నారా?

March 11, 2019


img

మన దేశంలో ఉన్నంత భిన్నత్వం బహుశః ప్రపంచంలో మరే దేశంలోను కనబడదేమో. ఒకే దేశంలో వందలాది భాషలు, మతాలు, కులాలు, భిన్నమైన వేషధారణలు, ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలను చూసి ఇంత భిన్నత్వం కలిగిన వీరందరూ కలిసిమెలిసి ఏవిధంగా జీవిస్తున్నారని విదేశీపర్యాటకులు చాలా ఆశ్చర్యపోతుంటారు. ఈ భిన్నత్వంలో ఏకత్వానికి కారకులైన కోట్లాదిమంది భారతీయులకు తమ దేశపు గొప్పదనం గురించి తెలియదనే చెప్పవచ్చు. మన తెలంగాణతో సహా దేశంలోని వివిద రాష్ట్రాలలో 13 గ్రామాల విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకొందాం. 

• మహారాష్ట్రలోని శనిసింగాపూర్ గ్రామం: ఈ గ్రామంలో ఇళ్ళకు తలుపులు ఉండవు. ఉన్నా తాళాలు వేసుకోరు. ఎందుకంటే ఇక్కడ ఎన్నడూ దొంగతనాలు జరుగవు. కనుక పోలీస్ స్టేషన్ కూడా లేదు. 

• మహారాష్ట్రలోని సీతాఫల్ గ్రామం: ఈ గ్రామంలో ప్రతీ ఇంట్లో విషసర్పాలను పెంచుకొంటారు. వాటిని కూడా కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. 


• మహారాష్ట్రలోని హివెరీబజార్ గ్రామం: ఈ గ్రామంలో 60 మంది లక్షాధికారులున్నారు. అత్యాధునిక సాగునీటి సదుపాయాలు ఏర్పాటుచేసుకొని నీటి కరువు సమస్యలను అధిగమించారు

మహారాష్ట్రలోని కోర్ లాయ్ గ్రామం: దేశంలో పోర్చుగీస్ బాషను మాట్లాడే ఏకైక గ్రామం ఇది. ఈ గ్రామంలో ప్రజలందరూ తమ రోజువారీ వ్యవహారాలను పోర్చుగీసు బాషలోనే మాట్లాడుకొంటారు. 

• కర్ణాటకలోని మట్టూర్ గ్రామం: ఈ గ్రామంలో నివశించేవారందరూ తమ రోజువారీ వ్యవహారాలను సంస్కృత బాషలోనే మాట్లాడుకొంటారు.

• గుజరాత్ లోని పున్సారీ గ్రామం: ఇది దేశంలో అత్యాధునిక గ్రామంగా పేరొందింది. గ్రామస్తులందరికీ వైఫీ, ఇంటర్నెట్, కంప్యూటర్స్ తదితర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై మంచి అవగాహన కలిగి ఉన్నారు. కనుక ప్రతీ ఇంట్లో సిసి కెమెరాలు, కంప్యూటర్స్, సోలార్ పవర్ వగైరా ఆధునిక పరికరాలను వినియోగిస్తుంటారు. గ్రామంలో విద్యుత్ దీపాలన్నీ సోలార్ విద్యుత్ తోనే వెలుగుతాయి. చాలా కాలం క్రితమే గ్రామంలో సిసి కెమెరాల వాడకం మొదలైంది.  

• గుజరాత్ లోని జంబూర్ గ్రామం: ఈ గ్రామంలో నివశిస్తున్న వారందరూ ఆఫ్రికాలోని నీగ్రో జాతివారిని పోలి ఉంటారు. 

• తెలంగాణలోని గంగదేవిపల్లి గ్రామం: దేశంలోకెల్లా అత్యాధునిక గ్రామంగా నిలిచింది. ఈ గ్రామంలో పచ్చదనం పరిశుభ్రమైన రోడ్లు వాతావరణం, ఇంటర్నెట్, వైఫీ, సోలార్ పవర్ వినియోగం, రక్షిత మంచినీరు సరఫరా వంటివి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. గ్రామస్తులు అందరూ ఉచితంగా వినియోగించుకొనేందుకు కమ్యూనిటీ వైఫీ, కమ్యూనిటీ కేబిల్ వ్యవస్థలను చాలా కాలం క్రితమే ఏర్పాటు చేసుకొన్నారు. ఈ గ్రామంలో చాలా కాలంగా మధ్యపాన నిషేధం అమలులో ఉంది. అలాగే విద్యా కమిటీ, వైద్య కమిటీ, తల్లుల కమిటీ, మధ్యపాన నిషేద కమిటీ, రుణవసూలు కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ, మంచినీటి సరఫరా పర్యవేక్షణ కమిటీలున్నాయి. ఈ గ్రామంలో ఏకంగా 14 కోపరేటివ్ సేవింగ్ కమిటీలున్నాయి. 


• రాజస్థాన్ లోని కుల్ దహార్ గ్రామం: ఈ గ్రామంలో ఎవరూ నివసించరు. గ్రామంలో భూతప్రేత పిశాచాలు తిరుగుతుంటాయని భావిస్తున్న గ్రామస్తులు ఇళ్ళు ఖాళీ చేసి పక్క గ్రామాలకు తరలివెళ్ళిపోవడంతో గ్రామంలో మనుషుల జాడ కనిపించదు.   

• కేరళలోని కోధిన్హి గ్రామం: ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే అందరూ కవలలే. గ్రామంలో 400 కవలలున్నారు. దేశంలో మరెక్కడా ఇంత మంది కవలలు లేరు. 


• బిహార్ లోని బర్వాన్ కాలా గ్రామం: ఈ గ్రామంలో గత 50 ఏళ్ళుగా ఎవరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదు. కనుక గ్రామంలో ఉన్నవారందరూ ముసలి బ్యాచిలర్సే!

• మేఘాలయాలోని మైలైనాంగ్ గ్రామం: ఆసియా ఖండంలోకెల్లా ఈ గ్రామం అత్యంత పరిశుబ్రమైన గ్రామంగా నిలిచింది. ఈ గ్రామంలోనే అనేక దశాబ్ధాలుగా ఒక చిన్న రాయిపై ఒక పెద్ద బండరాయి నిలబడి ఉంది. నేటికీ అలాగే నిలిచి ఉంది.

 

• అస్సోంలోని రోంగ్ దోయ్ గ్రామం: ఈ గ్రామంలో ప్రతీ ఏటా కప్పలకు పెళ్ళిళ్ళు జరిపిస్తుంటారు. కప్పలకు పెళ్ళిళ్ళు జరిపిస్తేనే వానలు కురుస్తాయని గ్రామస్తుల నమ్మకం.


Related Post