తెలుగు రాష్ట్రాలలో ఒకే రోజున పోలింగ్ ఎందుకంటే..

March 11, 2019


img

ఏడు దశలలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో మొదటిదశలో ఏప్రిల్ 11న ఒకే రోజున ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ సునీల్ అరోరా ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. “ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు ఒకేరోజున ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నామంటే, హైదరాబాద్‌లో స్థిరపడినకొందరు రెండు రాష్ట్రాలలో ఓటు హక్కు వినియోగించుకోకుండా నిరోధించడానికే,” అని అన్నారు.  

ఒక వ్యక్తికి ఒకే ఓటు హక్కు ఉండాలి. కానీ ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటిని వారు స్వచ్ఛందంగా రద్దు చేసుకోవాలి. ఒకవేళ వారు రద్దుచేసుకోకపోతే ఎన్నికల సంఘం అటువంటి వాటిని గుర్తించి రద్దు చేయాలి. కానీ ఆ పని చేయకుండా రెండు రాష్ట్రాలలో ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకోవడానికి ఒకే రోజున పోలింగ్ నిర్వహిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ స్వయంగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది.  



Related Post