హైస్పీడ్ రైలుకు ఆవులు,గేదెలు స్పీడ్ బ్రేకర్స్?

February 16, 2019


img

భారతీయరైల్వేది చాలా విచిత్రమైన పరిస్థితని చెప్పవచ్చు. అవసరానికి మించి డిమాండ్ ఉన్నప్పటికీ నానాటికీ పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినన్ని రైళ్ళు, రైల్వే లైనులు నిర్మించలేకపోతోంది. రైల్వేశాఖ చేసిన తాజా ప్రయోగం డిల్లీ-బనారస్ నగరాల మద్య గంటకు 180కిమీ వేగంతో దూసుకుపోయే వందేమాతరం ఎక్స్‌ప్రెస్‌కు ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. 

ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం దానికి డిల్లీలో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అది ఎటువంటి ఇబ్బందులు లేకుండా బనారస్ చేరుకొంది కానీ తిరుగు ప్రయాణంలో రెండుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తగా వాటిని ఇంజనీర్లు సరిదిద్దారు. మళ్ళీ వేగం పుంజుకొని బయలుదేరగా ఈసారి పట్టాలపైకి గేదె రావడంతో దానిని గుద్దుకొని రైలు నిలిచిపోయింది. విషయం తెలుసుకొన్న అధికారులు, రైల్వే సిబ్బంది, అగ్నిమాపకదళాలు హుటాహుటిన అక్కడకు చేరుకొని అతికష్టం మీద రైలు చక్రాలలో ఇరుక్కొన్న గేదె కళేబారన్ని బయటకు తీసి హైస్పీడు రైలుకు విముక్తి కల్పించారు. ఆ తరువాత అది గంటకు 130కిమీ వేగంతో డిల్లీకి చేరుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న పాత్రికేయులు తదితరులు ‘హమ్మయ్య’ అని నిట్టూర్పులు విడుస్తూ దిగారు. 

హైస్పీడు రైలును ప్రవేశపెట్టినంత మాత్రన్న సరిపోదు...అది సజావుగా ప్రయాణించడానికి వీలుగా ఆ మార్గం వెంబడి రైల్వే పట్టాల నిర్వహణ, రైలు వచ్చే సమయంలో పట్టాలపై ఆవులు, గేదెలు, మేకలు, మనుషులు, వాహనాలు , స్కూలు బస్సులు వగైరా సంచరించకుండా కాపలాకాయడం చాలా అవసరమని ఈ ఘటనతో స్పష్టం అయ్యింది లేకుంటే హైస్పీడు రైలుకు ఆవులు, గేదెలు, మేకలు, వాహనాలే స్పీడ్ బ్రేకర్లుగా మారే అవకాశం ఉంది.                     



Related Post