బడ్జెట్‌ ఎవరు ప్రవేశపెడతారో?

February 11, 2019


img

వసంత పంచమి శుభదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ జరుగలేదు. కానీ 5-6 రోజులలోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సిఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పడంతో ఈవారంలోగా ఆ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. 

మంత్రివర్గం విస్తరణ చేసి ఆర్ధికమంత్రిని నియమించుకున్నట్లయితే, శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో ఆయన లేదా ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ ఇంకా ఆలస్యం అయినట్లయితే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో హోంమంత్రి మహమూద్ ఆలీ శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టవలసి ఉంటుంది. 

ఈ నెలాఖరులోగా శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించవలసి ఉంది. కనుక ఆలోగా బడ్జెట్‌ పుస్తకాలను ముద్రించి సిద్దం చేయవలసి ఉంది. బడ్జెట్‌ను శాసనసభలో ఎవరు ప్రవేశపెడతారో వారి పేరే వాటిపై ముద్రించబడుతుంది. కనుక ఈసారి బడ్జెట్‌ ఎవరు ప్రవేశపెడతారో తెలియాలంటే మరో 4-5 రోజులు వేచి చూడక తప్పదు. మంత్రివర్గ విస్తరణ జరిగినట్లయితే ఈసారి బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెడతారనే దానిపై స్పష్టత వస్తుంది లేకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టవలసి ఉంటుంది. గత ప్రభుత్వంలో ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. మళ్ళీ ఈసారి కూడా ఆయనకే ఆర్ధికశాఖను అప్పగిస్తారా లేదా కొత్తవారికి అప్పగిస్తారా? అనే విషయం కూడా అప్పుడే తెలుస్తుంది. 


Related Post