ఏపీలో కేసీఆర్‌ ప్రచారం చేయాలి: కేఏ పాల్

January 16, 2019


img

సిఎం కేసీఆర్‌ ఇంతవరకు కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్ళి అక్కడి ప్రాంతీయపార్టీల అధినేతలతో సమావేశాలైనప్పుడు కనిపించని స్పందన ఈరోజు కేటీఆర్‌-జగన్ ఒక్క భేటీతో కనిపిస్తోంది. వారి భేటీపై అప్పుడే టిడిపి మంత్రులు, నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కేటీఆర్‌-జగన్ భేటీతో వారు ఉలికిపడటం, ఆందోళన చెందటం సహజమే కానీ ఏపీ కాంగ్రెస్‌, ప్రజాశాంతి పార్టీల నేతలు కూడా తీవ్రంగా స్పందించడం విశేషం. 

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ స్పందిస్తూ, “త్వరలో జరుగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ సిఎం కేసీఆర్‌ వైయెస్ జగన్మోహన్ రెడ్డి తరపున ఏ‌పిలో ప్రచారం చేయాలని కోరుకొంటున్నాను. ఆయన వచ్చి ప్రచారం చేస్తే వైకాపాకు డిపాజిట్లు కూడా రావని ఖచ్చితంగా చెప్పగలను. జగన్ లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డాడు. ఆయనపై 12 ఛార్జ్ షీట్లున్నాయి. అటువంటి వ్యక్తితో టిఆర్ఎస్ స్నేహం చేస్తోంది. ఎందుకంటే, అక్కడ టిఆర్ఎస్, ఇక్కడ వైకాపా రెండూ కూడా మోడీ కోసమే చేతులు కలుపుతున్నాయి,” అని అన్నారు. 

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాట్లాడుతూ, “తెరాసతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కొట్టుకొంటున్నారు,” అని అన్నారు. 


Related Post