కేసీఆర్‌ బాటలో చంద్రబాబు

January 11, 2019


img

సాధారణంగా గురువు చూపిన బాటలో శిష్యులు ముందుకు సాగుతుంటారు కానీ గురుశిష్యులైన చంద్రబాబునాయుడు-కేసీఆర్‌ ల విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. శిష్యుడు కేసీఆర్‌ బాటలో చంద్రబాబు నడుస్తుండటం విశేషం. 

తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులకు ఇదివరకు ఇస్తున్న రూ.1,000 పెన్షన్ రెట్టింపు చేస్తానని సిఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో కూడా ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు, ఇప్పటి వరకు ఇస్తున్న రూ.1,000 పెన్షన్ ను రెట్టింపు చేసి జనవరి నెల నుంచే నెలకు రూ.2,000 ఇస్తామని ఈరోజు నెల్లూరులో ప్రకటించారు. దీని వలన ఏపీలో సుమారు 54 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. 

తెలంగాణ ధనిక రాష్ట్రం కనుక రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉదారంగా సంక్షేమ పధకాలను అమలుచేయగలదు. కానీ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్ధికఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ చంద్రబాబునాయుడు సంక్షేమ పధకాలన్నిటినీ గత నాలుగున్నరేళ్ళుగా విజయవంతంగా కొనసాగించడం చాలా గొప్ప విషయం. ఇక కేసీఆర్‌ పధకాలను కాపీ కొడుతుండటం గురించి ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘మంచి ఎక్కడున్నా స్వీకరిస్తాను’ అని చంద్రబాబు చెప్పడం అభినందనీయమే. ఈవిషయంలో చంద్రబాబుకు కేసీఆర్‌ ఆదర్శంగా నిలవడం ఇంకా గొప్ప విషయం.


Related Post