యాదాద్రి స్తంభాలపై తెరాస నేతల ప్రతిమలు ఉంటాయా?

January 03, 2019


img

పూర్వం చక్రవర్తులు, రాజులు యుద్ధాలు చేసి సామ్రాజ్యాలను గెలుచుకొన్నప్పుడో లేక తమ పాలనా వైభవాలను భావి తరాలకు తెలియజేసేందుకో ఆలయాల గోడలపై శిలాశాసనాలను చెక్కించేవారు. విజయ స్థూపాలను నిర్మించేవారు. వాటిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం కూడా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలోని    అష్టభుజి ప్రాకార మండపంలోని బాలపాద స్తంభాలపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, తెలంగాణ పండుగలు.. ఆటపాటలను ప్రతిబింబించే విధంగా శిల్పాలు చెక్కిస్తోంది. అదేవిధంగా తెలంగాణ ఏర్పాటుకు దారి తీసిన ఉద్యమాలు వాటి చరిత్ర, ఉద్యమకారుల శిల్పాలను కూడా చెక్కిస్తున్నట్లు తాజా సమాచారం. ఉద్యమకారులు అంటే మొదట గుర్తుకు వచ్చేది కేసిఆరే అని చెప్పవచ్చు. ఆ తరువాత కేటీఆర్, కవిత, మొదటితరం, రెండవతరం ఉద్యమకారులు అనేకమంది ఉన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయితే కానీ బాలపాద స్తంభాలపై ఎవరెవరి ప్రతిమలు ఉంటాయో తెలియదు. ఒకవేళ యాదాద్రి బాలపాద స్తంభాలపై కేసిఆర్, తెరాస నేతల విగ్రహాలు చెక్కిస్తే, అదొక సరికొత్త సాంప్రదాయం, సరికొత్త వివాదాలకు శ్రీకారం చుట్టినట్లవుతుంది.


Related Post