తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్-డౌన్ స్టార్ట్

December 05, 2018


img

 బుదవారం సాయంత్రం 5 గంటలకు  రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగియడంతో అత్యంత కీలకమైన పోలింగుకు కౌంట్-డౌన్ మొదలైంది. ఇప్పటి నుంచి సరిగ్గా 36 గంటల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగబోతోంది. కనుక అన్ని పార్టీలు, ఎన్నికల సంఘం, పోలీస్ శాఖల అధికారులు, భద్రతాదళాలు, పోలింగ్ సిబ్బంది అందరూ ఆ కీలక ఘట్టం కోసం సన్నదం అవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌ ఎన్నికల ప్రక్రియకు సంబందించిన వివరాలను మీడియాకు తెలియజేశారు. 

మొత్తం అసెంబ్లీ స్థానాలు: 119. 

పోటీ పడుతున్న అభ్యర్ధులు: 1,821 మంది

ఓటర్ల సంఖ్య: 2,80,64,684 మంది

పోలింగ్ సిబ్బంది సంఖ్య: 1,640, 509.

సహాయ సిబ్బంది: 649 మంది. 

పోలింగ్ కేంద్రాలు: 32,815 

బ్యాలెట్ యూనిట్లు (ఈవిఎంలు): 55,329, 

వివి ఫ్యాట్ యంత్రాలు: 39,763 (ఓటర్లకు రశీదు ఇచ్చే యంత్రాలు)

కంట్రోల్ యూనిట్లు: 39,763   

కేంద్ర బలగాలు: 279 కంపెనీలు 

రాష్ట్ర భద్రత సిబ్బంది:30,000 మంది

పోలింగు తేదీ: డిసెంబరు 7 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు. 

సమస్యాత్మక ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. 

ఓట్ల లెక్కింపు: డిసెంబరు 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ముగిసేవరకు. 

ఫలితాలు వెల్లడి: డిసెంబరు 11వ తేదీ.  



Related Post