బెల్ట్ షాపులు ఇలా చేస్తే మైనర్లకు మందు దొరకడం కష్టమే!

July 12, 2016


img

మైనర్లకు మందు అమ్మకూడదు అని వైన్ షాపు ముందు బోర్డుల మీద తప్ప, మందు విక్రయించే ఓనర్ కి గాని, మందు కొనే వినియోగదారునికి గాని, ఆఖరికి ప్రభుత్వానికి కూడా దాని గురించి పట్టించుకునే తీరిక గాని ఓపిక గాని లేదనే చెప్పాలి. అందుకేనేమో సిటీలలో మైనర్లకు కూడా మందు విచ్చలవిడిగా దొరుకుతుండడం, అది తాగి రోడ్ల మీద తిరుగుతూ అమాయకుల ప్రాణాలని హరించడం చేస్తున్నారు. ఇటీవల పంజాగుట్ట లో చిన్నారి రమ్య ఘటన గాని, బంజారా హిల్స్ లో ఐదుగురు మైనర్ల ఘటన గాని, అన్నీ ఈ కోవలోకి వచ్చేవే. ఇలా వెంటవెంటనే ఘోరాలు జరుగుతుంటే, ప్రభుత్వం ఎందుకని కఠిన చర్యలు తీసుకోవడం లేదు.

మైనర్లకు మందు అమ్మకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రతి వినియోగదారుని వయసు గుర్తించే కార్డు చూపిస్తేనే మందు అమ్మే విధంగా చేయడం, ప్రతి మందు షాపులో ఒక పోలీస్ ని నియమించి, ఈ ప్రక్రియ సరిగ్గా సాగుతుందో లేదో అని చూడడం, తేడా వస్తే ఆ పోలీసే బాధ్యత వహించడం వంటి చర్యలు ప్రభుత్వం చేపడితే రమ్య లాంటి పసికందుల బలి ఆగదంటారా? ఇందులో కూడా లొసుగులు లేకపోలేదు. కానీ ఇది పాటిస్తే ఒక్కరినైనా ఆదుకోలేమా? ఆ ఒక్క ప్రాణం కూడా ఒక్క కుటుంబానికి చాలా విలువైనదే కదా? ఇదే ఆలోచనతో, తెలంగాణ తో పాటు అన్ని ప్రభుత్వాలు ముందుకు వచ్చి అమలు పర్చాలని కోరుకుందాం.   


Related Post