తెలంగాణలో మళ్ళీ తెరాసాకే అధికారం?

October 10, 2018


img

ఉగాది పండుగవస్తే పంచాంగాలు, ఎన్నికలొస్తే సర్వేలు సర్వసాధారణం. త్వరలో 5 రాష్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక సీ–వోటర్, టైమ్స్‌ నౌ, ఐటీటెక్‌ గ్రూప్‌ తదితర సంస్థలు రంగంలో దిగి సర్వేలు చేయడం మొదలుపెట్టాయి. అవి వెలువరించిన తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో మళ్ళీ తెరాసాయే అధికారంలోకి రాబోతోంది. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో తెరాస సుమారు 85, కాంగ్రెస్ పార్టీ-18, మజ్లీస్-7, బిజెపి-5, ఇతరులు-4 సీట్లు గెలుచుకోవచ్చునని తెలిపింది.    

బిజెపి పాలిత రాష్ట్రాలలో  రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చునని, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలలో మాత్రం మళ్ళీ బిజెపియే అధికారంలోకి రావచ్చునని సర్వే నివేదికలో పేర్కొంది. 

రాజస్థాన్: మొత్తం స్థానాలు: 200. వాటిలో కాంగ్రెస్-129, బిజెపి-63, ఇతరులు-8 సీట్లు గెలుచుకొంటారు.

ఛత్తీస్‌గఢ్‌: మొత్తం స్థానాలు: 90. వాటిలో కాంగ్రెస్-47, బిజెపి-36, ఇతరులు-4 సీట్లు గెలుచుకొంటారు.  

మధ్యప్రదేశ్: మొత్తం స్థానాలు: 230. వాటిలో బిజెపి-126, కాంగ్రెస్-97, ఇతరులు-7 సీట్లు గెలుచుకొంటారని తాజా సర్వేలో వెల్లడి అయ్యింది.


Related Post